Prashanth Neel: బిగ్ అప్డేట్… కేజీఎఫ్ 3 ముహూర్తం ఫిక్స్

Prashanth Neel

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామి అంతా ఇంత కాదు. ఈ సినిమాలతోనే కన్నడ ఇండస్ట్రీ పవర్ ఏంటో సినీ ప్రపంచానికి తెలిసింది. నాన్ బాహుబలి రికార్డులను కొల్ల గొట్టి కొత్త రికార్డులను నమోదు చేసింది. కేజీఎఫ్ కంటే, కేజీఎఫ్ 2 సృష్టించిన సునామి అయితే వేరే లెవెల్. అయితే కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో కేజీఎఫ్ 3 ఉంటుందని చిన్న హింట్ ఇచ్చారు. కానీ, అది ఎప్పుడు వస్తుందో.. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

అయితే ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. కేజీఎఫ్ 3పై నిర్మాతలు హోంబులె ఫిల్మ్స్ ఒక క్లారిటీ ఇచ్చారట. కేజీఎఫ్ 3 సిద్దమవుతున్నట్టు చెప్పారట. ఈ ఏడాది చివరలో కేజీఎఫ్ 3 ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయబోతున్నారని టాక్. అంతే కాదు, కేజీఎఫ్ 3 ప్రాజెక్ట్ గురించి డిసెంబర్ 21న అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందట.

2024 అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి, 2025 జనవరి లేదా సమ్మర్ లో థియేటర్ లోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. కాగా, ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ చేస్తున్నాడు. సలార్ రెండు పార్ట్స్ గా రానుంది. అలాగే ఎన్టీఆర్ తో మరో సినిమా చేయనున్నాడు. మరి ఇవి కేజీఎఫ్ 3 కంటే ముందు వస్తయా? లేదా ఈ రెండు సినిమాలు అయ్యాకే కేజీఎఫ్ 3 చేస్తారా? లేదా అన్ని ఒకేసారి షూట్ చేస్తారా ? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు