Pawan Kalyan : మ‌రో బాలీవుడ్ న‌టుడు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ తాజా చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ఈ మ‌ధ్య‌నే భీమ్లానాయ‌క్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు హిస్టారిక‌ల్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. క్రిష్ (జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ‌) ద‌ర్శ‌క‌త్వంలో హ‌ర హ‌ర వీర‌మ‌ల్లు సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం ఎప్పుడో ప్రారంభం అయిన‌ప్ప‌టికీ కరోనా కార‌ణంగా షూటింగ్ కాస్త ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది.

ఇక ఆ త‌రువాత ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌డంతో కూడా కాస్త ఆల‌స్యం జ‌రిగింది. వీలైనంత త్వ‌ర‌గా ఈ చిత్రాన్ని పూర్తి చేయాల‌ని పవ‌న్ భావిస్తున్నాడు. మొగ‌ల్స్ కాలం నాటి క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ బందిపోటుగా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రం కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ర్ర‌సాము ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఇదిలా ఉండ‌గా.. తాజాగా ఈ సినిమాలో చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోలు క‌నిపించ‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మ‌రో కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ విలక్ష‌ణ న‌టుడిని తీసుకోనున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓ కీల‌క పాత్ర కోసం బాబీ డియోల్‌ని ఎంపిక చేసారు. ఇటీవ‌ల వ‌చ్చిన ‘ఆశ్ర‌మం’ అనే సిరీస్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు బాబీ డియోల్‌. ప‌వ‌ర్ కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమా పాన్ ఇండియాగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంకోసం ప‌వ‌న్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు వ‌స్తుందో వేచి చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు