Veera Simha Reddy : మాస్ యాక్షన్ కు తోడు బ్యూటీ

ప్రస్తుతం టాలీవుడ్ లో వచ్చే సినిమాలో స్పెషల్ సాంగ్ కు దర్శక నిర్మాతలు ప్రియారిటీ ఇస్తున్నారు. ఫారెన్ భామలతో ఐటాం సాంగ్స్ చేసి, యూత్ ను ఆకర్సిస్తున్నారు. చిన్న స్థాయి హీరోల నుంచి అగ్ర హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలో ఐటెం గర్ల్ ఉంటుంది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం నందమూరి బాలయ్య కూడా ఒక ఐటెం సాంగ్ లో ఫారెన్ భామతో ఆడిపాడనున్నారని తెలుస్తుంది.

బాలయ్య చేతిలో ఉన్న సినిమాల్లో వీర సింహ రెడ్డి ఒకటి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ముందుగా NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంది. ఇటీవల దీవాళి సందర్బంగా సినిమాకు టైటిల్ ను వీర సింహ రెడ్డి అని ఫిక్స్ చేశారు. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. ఎక్కువ శాతం కర్నూల్ లో సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని మూవీ టీం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

అందు కోసం కొంత మంది హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలించారట. కానీ చివరికి ఆస్ట్రేలియా మోడల్ చంద్రికా రవిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. చంద్రికా రవి మోడిలింగ్ తో పాటు సౌత్ లో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. తమిళంలో ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు అనే అడల్ట్ కామెడీ సినిమాలో దయ్యం పాత్ర చేసింది. అలాగే తెలుగులో తొలిసారి చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాలో గెస్ట్ పాత్రలో మెరిసింది. ఇప్పుడు బాలయ్య సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

- Advertisement -

ఒక వేళ బాలయ్య సినిమాలో చంద్రికా రవి స్పెషల్ సాంగ్ చేస్తే.. వీర సింహ రెడ్డిలో మాస్ యాక్షన్ కు తోడుగా చంద్రికా రవి అందాలు కూడా ఉంటాయి. ఇవి నందమూరి అభిమానులకు మరింత థ్రిల్ ను ఇస్తాయని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు