Krithi Shetty: కృతి శెట్టికి లైఫ్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవలేదు. తెలుగు హీరోయిన్లే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా మన ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉన్నారు. అందం అలాగే చురుకుతనం ఉన్న హీరోయిన్లు… ఇండస్ట్రీలో ఎక్కువగా చాన్సులు కొట్టేస్తున్నారు. ఇక మరికొంతమంది.. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో పాపులర్ అవుతున్నారు.

అలాంటి వారిలో హీరోయిన్ కృతి శెట్టి ఒకరు. హీరోయిన్ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమాతో కృతి శెట్టి తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ బ్యూటీ కి తెలుగులో ఇదే మొట్టమొదటి సినిమా అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. కానీ ఉప్పన సినిమా తర్వాత పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది హీరోయిన్ కృతి శెట్టి.

అయితే తాజాగా హీరోయిన్ కృతి శెట్టి గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.విగ్నేష్ శివం దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ఫైనల్ అయిందట. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఇందులో కృత్తి శెట్టి కాకుండా నయనతార కూడా నటించనుందట. కానీ హీరో అక్కగా నయనతార కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొట్టింది.

- Advertisement -

దాని చివరి క్షణంలో రెమ్యూనరేషన్ నచ్చక ఆ సినిమాను వదులుకుందట నయనతార. దీంతో నయనతార పక్కకు జరిగి కృతి శెట్టి లైఫ్ ఇచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే నయనతార ఉంటే హీరోయిన్ కృతి శెట్టి ని ఎవరూ చూడరని వారి నమ్మకం. అందుకే హీరోయిన్ నయనతార కృతి శెట్టికి లైఫ్ ఇచ్చిందని అంటున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు