Shriya Saran: నాగ్ చేసిన సాయం 20 ఏళ్ల తర్వాత గుర్తు చేసుకుంది… ఇప్పుడే ఎందుకంటే…?

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా పలు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియా శరన్ తాజాగా నాగార్జున పై ఆసక్తికర కామెంట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. 20 ఏళ్లకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్తను ఆమె తాజాగా మీడియాతో పంచుకోవడం ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పవచ్చు. స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ అక్కినేని నాగార్జున తో కలసి పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనతో నటించడం పై ఈ ముద్దుగుమ్మ స్పందించింది.

శ్రియా – నాగ్ కాంబోలో మూవీలు:
ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో సంతోషం, నేనున్నాను, ఊపిరి, మనం వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాగా ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చూసిన ప్రతిసారి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇక వీరి కెమిస్ట్రీకి తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. నాగార్జున చాలామంది హీరోయిన్లతో కలిసి నటించినప్పటికీ కూడా శ్రియా – నాగార్జున కాంబో మాత్రం ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. అందుకే ఆ సినిమాలు ఇప్పటికీ కూడా గుర్తుండిపోయేలా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.

శ్రియా శరన్ కెరియర్..
అయితే తాజాగా శ్రియా శరన్ ప్రస్తుతం తన కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కరోనా సమయంలో వివాహం జరిగి ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత తనకు పెళ్లయిందని.. కూతురు కూడా పుట్టింది అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇప్పుడు మళ్లీ సినిమాలలో యాక్టివ్ గా మారిన ఈమె హిందీ చిత్రాలలో నటిస్తూ సందడి చేస్తోంది.

- Advertisement -

నాగ్ సహాయం..
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియా శరన్ నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. శ్రియా శరన్ మాట్లాడుతూ సౌత్ సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన నటులు ఉన్నారు.. వారిలో నేను నాగార్జునతో కలిసి పనిచేశాను.. అది నాకు ఒక అద్భుతమైన ఘట్టం.. ఆయన నాకు ముఖ్యంగా ధ్యానం ఎలా చేయాలో అర్థం అయ్యేలా నేర్పించారు. దానివల్ల ఇప్పటికి నేను నా జీవితంలో ప్రతిరోజు అన్ని పరిస్థితులను ధైర్యంగా మనశ్శాంతిగా ఎదుర్కోగలుగుతున్నాను. నా లైఫ్ లో నాకు చేసిన సహాయం ఏదైనా ఉందంటే అది ఇదే.. అది గొప్ప సహాయంగా నేను భావిస్తున్నాను అంటూ శ్రియా శరణ్ 20 ఏళ్ల క్రితం నాగార్జున తనకు నేర్పించిన ధ్యానం గురించి చెబుతూ పలు కామెంట్లు చేసింద నాగార్జునపై ఈమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ఒక వైపు సినిమాలు మరొకవైపు బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలకు హోస్టుగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని దక్కించుకున్నారు నాగార్జున. ఇక శ్రియా శరన్ కూడా వరుసగా పాన్ ఇండియా చిత్రాలకు ఓకే చేస్తూ మరింత బిజీగా మారిపోయింది.. ఏది ఏమైనా మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు