Niharika: నిహారిక సెకండ్ మ్యారేజ్… లవ్ అంటూ బయటపడ్డ మెగా ప్రిన్స్

మెగా డాటర్ నిహారిక మళ్లీ పెళ్లికి రెడీగా ఉంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా ఆమె బయట పెట్టడం విశేషం. అయితే ఈసారి మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మరి ఇంతకీ నిహారిక రెండవ పెళ్ళి కథ ఏంటి? లవ్ గురించి ఆమె చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

నిహారిక టాలీవుడ్ ఎంట్రీ…
మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ హీరోయిన్ గా మారే సాహసం చేసిన ఒకే ఒక్క మెగా వారసురాలు మాత్రం నిహారికే. ముందుగా ఢీ వంటి పలు బుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించిన ఈ బ్యూటీ “ఒక మనసు” మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ మొదటి సినిమానే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆమెకు నిరాశ తప్పలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లతో కాలం వెళ్లదీసింది. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో సైలెంట్ గా పెద్దలు తెచ్చిన సంబంధానికి ఓకే చెప్పి, పెళ్లి చేసేసుకుంది.

నిహారిక పెళ్లి, విడాకులు…
చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని నిహారిక అరేంజ్ మ్యారేజ్ చేసుకుంది. మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే పెళ్లి అయినా కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి డివోర్స్ బాట పట్టారు. చివరికి విడాకులు తీసుకొని, మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది నిహారిక.

- Advertisement -

“సాగు” అనే ఇండిపెండెంట్ మూవీకి ప్రెజంటర్ గా… సెకండ్ ఇన్నింగ్స్ లో నిహారిక కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో పలు ఓటిటి సిరీస్ లను నిర్మించింది. రీసెంట్ గా డెడ్ పిక్సెల్స్ అనే సిరీస్ తో మళ్ళీ యాక్టింగ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు చెఫ్ మంత్రా సీజన్ 3కి నిహారిక హోస్ట్ గా వ్యవహరిస్తోంది. “సాగు” అనే ఇండిపెండెంట్ ఓటిటి మూవీకి ప్రజెంటర్ గా వ్యవహరిస్తోంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న “సాగు” మూవీ ప్రమోషన్లలో భాగంగా నిహారిక తన రెండవ పెళ్లి, లవ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

రెండవ పెళ్ళి…
రిలేషన్షిప్ వర్కౌట్ కాకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయని, అలాంటి రీజన్స్ వల్లే తనకు కూడా వర్కౌట్ కాలేదని వెల్లడించింది నిహారిక. అయితే అలాగని మళ్లీ లవ్ పుట్టదు, మరొకరి మీద ప్రేమ కలగదు అనుకోవడం మూర్ఖత్వమేనని, తను ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. తనకు పిల్లలు అంటే ఇష్టమని, పిల్లలు కావాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని మనసులోని మాటను బయట పెట్టింది. అయితే తనకు లవ్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ లేదని, రెండవ పెళ్లి ఎప్పుడంటే ఇప్పుడే చెప్పలేనని, కానీ పెళ్లయితే చేసుకుంటానని, అది కూడా లవ్ మ్యారేజ్ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో పనిలో పనిగా కాబోయే లవర్ ఎలా ఉండాలో చెప్తే బాగుండేది అంటున్నారు ఆమె అభిమానులు. మొత్తానికి పెళ్లయి డివోర్స్ తీసుకున్న ఈ బ్యూటీ రెండో పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు