NTR : అవకాశం సీత చెంతకు ?

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నటి అనడం కంటే.. తెలుగు నటి అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే.. ఇటీవల వచ్చిన సీతారామం సినిమాతో మృణాల్ ను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. అందుకే ఈ భామ బాలీవుడ్ వైపు చూడకుండా తెలుగులోనే మరో సినిమా చేయాలని చూస్తుంది. దీని వల్లే సీతారామం హిట్ అయి మూడు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. నిజానికి సీతారామం బ్లాక్ బస్టర్ తర్వాత మృణాల్ కు ఇతర ఇండస్ట్రీల నుంచి భారీగానే ఛాన్స్ లు వస్తున్నాయి.

అయితే తెలుగులోనే తన తర్వాత సినిమా చేయాలని భీష్మించు కూర్చోవడంతో ఇప్పటి వరకు సినిమా ఫిక్స్ కాలేదు. అలాగే ఈ విషయాన్ని మృణాల్ బహిరంగంగానే చెబుతుంది. దీంతో ఈ సీతమ్మ ఒక భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ NTR30. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటిని తీసుకోవాలని కొరటాల చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. కానీ, ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా సెట్ కాలేదు. ఇదే సమయంలో బాలీవుడ్ నటి, సీతారామంతో తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో సినిమా చేయాలని చెబుతుంది.

- Advertisement -

దీంతో మృణాల్ ను సెట్ చేస్తే తెలుగులో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సినిమాపై క్రేజ్ వస్తుందని దర్శకుడు కొరటాల భావిస్తున్నట్టు సమాచారం. అందుకే మృణాల్ ను NTR30 లో దాదాపుగా ఫిక్స్ చేశారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రావొచ్చని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు