Sreeleela : డబ్బు కోసమే సినిమాలు… ఈ బ్యూటీకి అందుకేనా ఇన్ని ఫ్లాప్స్?

టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న క్రేజీ బ్యూటీ శ్రీలీల కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తుందా? అందుకే ఆమె ఖాతాలో ఇన్ని ప్లాప్స్ పడ్డాయా?

మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పెళ్లి సందడి అనే సినిమాతో ఏ ముహూర్తాన టాలీవుడ్లోకి అడుగు పెట్టిందో గాని ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థానాన్ని దక్కించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఆమె హీరోయిన్ గా నటించిన ధమాకా సినిమా హిట్ కావడం, అందులో ఆమె అద్భుతమైన డాన్స్ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసాయి. దీంతో యూత్ అంతా ఒక్కసారిగా శ్రీలీల మాయలో పడిపోయారు. ఫస్ట్ మూవీ పెళ్లి సందడి కంటే ధమాకా మూవీతోనే ఈ బ్యూటీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతోపాటు మంచి గుర్తింపు లభించింది. అయితే ప్రస్తుతం శ్రీలీల చేస్తున్న సినిమాలు చూస్తే ఆమె డబ్బు కోసమే సినిమాలు చేస్తుందని అనిపిస్తోందని విమర్శిస్తున్నారు.

ధమాకా తర్వాత బాలయ్యతో ఈమె చేసిన భగవంత్ కేసరి సినిమా తప్ప ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు. ఈ ఏడాది శ్రీ లీల నటించిన సినిమాలేవి పెద్దగా ఆడలేదు. ఎనర్జిటిక్ హీరో రామ్ తో స్కంద, పంజా వైష్ణవ తేజ్ తో ఆదికేశవ, నితిన్ తో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శ్రీలీల. ఈ మూడు సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఆఫర్లు వెల్లువెత్తుతున్న ఇలాంటి టైంలో శ్రీలీల సరైన కథలను ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతోందని, పైగా సినిమాలో తన పాత్ర, దానికి ఉండాల్సిన ప్రాధాన్యత గురించి ఈ బ్యూటీ పెద్దగా పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బ్యూటీ కాన్సన్ట్రేషన్ అంతా డబ్బు సంపాదించుకోవడం మాత్రమేనని, అందుకే ఇలా ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తోందని అంటున్నారు.

- Advertisement -

రీసెంట్ గా రిలీజ్ అయిన నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో శ్రీలీల పాత్ర నుంచి డబ్బింగ్ వరకు ప్రతి విషయం ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేసింది. ప్రస్తుతం శ్రీ లీల ఖాతాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. నిజానికి శ్రీలీల అద్భుతమైన డాన్సర్, అలాగే నటి కూడా. ఎక్కువ సినిమాలు చేయాలన్న హడావిడి కి పోకుండా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ మంచి పాత్రలు చేయాలని, అప్పుడే ఆమె టాలీవుడ్ లో ఎక్కువ కాలం నిలబడగలుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు