Netflix : నెట్ ఫ్లిక్స్ అధినేత హీరోలను కలవడం వెనుక సీక్రెట్ ఏంటి? కన్ఫ్యూజ్ చేస్తున్నారే !

పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అధినేత అసలు ఇండియాలో ఏం చేస్తున్నాడు? టాలీవుడ్ టాప్ స్టార్ ను కలవడం వెనక సీక్రెట్ ఏంటి?

ప్రపంచంలోనే అతిపెద్ద ఓటిటి ప్లాట్ ఫామ్ లలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ భారతదేశంలో తన ఉనికిని సుస్థిరం చేసుకోవడానికి అడుగులు ముందుకేస్తోంది. ది సేక్రేడ్ గేమ్స్, స్క్విడ్ గేమ్ వంటి అద్భుతమైన వెబ్ సిరీస్ లతో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో సబ్స్క్రైబర్స్ ను సంపాదించుకుంది. అయితే ఇప్పటిదాకా ఇండియన్ సబ్స్క్రైబర్స్ కు పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వకుండా కేవలం ఇంగ్లీష్ మూవీస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి, అడపాదడపా తెలుగు సినిమాలను రిలీజ్ చేసింది. ఈ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతున్న కొన్ని మంచి వెబ్ సిరీస్ లు, సినిమాలను సౌత్ భాషల్లో రిలీజ్ చేయకుండా, కేవలం ఇతర భాషల్లో రిలీజ్ చేసి సౌత్ ఆడియన్స్ ను కించపరుస్తున్నారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఇండియన్ సినీ చరిత్రలో సౌత్ ముఖ్యంగా టాలీవుడ్ కొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరెండోస్ టాలీవుడ్ దిగ్గజ నటులను కలుస్తూ ఉండడం ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న సరెండోస్ వరుసగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, నందమూరి ఫ్యామిలీలను కలిశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు సరెండోస్ ఎందుకు స్పెషల్ గా టాలీవుడ్ స్టార్స్ ను కలుస్తున్నాడు అనేది అంత చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. నిజానికి ప్రభాస్, మహేష్ వంటి స్టార్స్ తమ సినిమాలో షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎవరైనా స్పెషల్ గెస్ట్ ను కలవాలంటే హాఫ్ డే వేస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి శరవేగంగా జరుగుతున్న తమ సినిమాలను డిస్టర్బ్ చేసే మూడ్లో లేరు హీరోలు. కానీ ఆశ్చర్యకరంగా ఈ టాప్ స్టార్ అంతా నెట్ ఫ్లిక్స్ సీఈవో ను కలిశారు.

- Advertisement -

ఒకవేళ సరెండోస్ గనక అగ్ర నిర్మాతలను కలిస్తే ఆయన వాళ్లతో సినిమా కొనుగోలు ఒప్పందం గురించి డీల్ చేస్తున్నాడని అనుకునే అవకాశం ఉండేది. సాధారణంగా అలాంటి డీల్స్ అన్ని సీక్రెట్ గా జరుగుతాయి. అయితే నెట్ ఫ్లిక్స్ బాస్ మాత్రం అగ్ర హీరోలను కలవడానికి హైదరాబాద్ వచ్చి, వాళ్లతో ఫోటోలు దిగి పోస్ట్ చేయడం వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అని తలలు పట్టుకుంటున్నారు. ఈ స్టార్స్ అంతా నెట్ ఫ్లిక్స్ కోసం ప్రత్యేకమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా చేయడం లేదు. ఇక వాళ్ల సినిమాలకు సంబంధించిన రైట్స్ ను నిర్మాతలే చూసుకుంటారు. మరి సరెండోస్ సీక్రెట్ గా ఏం ప్లాన్ చేస్తున్నారు?

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు