Prabhas : ఈ నెల‌లోనే

ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ చిత్రం రూపొందునున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అతికొద్దీ మంది మాత్రమే హాజరైనట్టు సమాచారం. ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ.. ఇంకా అగ్రిమెంట్ పై సంతకం చేయలేదని అంటున్నారు. వీలైనంత త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి పూర్తి చేయాలని డైరెక్టర్ మారుతి భావిస్తున్నారు. ఇది ఒక హారర్ కామెడీ అని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది.

అయితే సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ లేకపోయినా ఈ సినిమాని పట్టాలెక్కించేయాలన్న నిర్ణయానికి మారుతి వచ్చారని.. ముందుగా ప్రభాస్ లేని సీన్లని తీసే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ లో ఓ సెట్ ని తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ప్రభాస్ చేస్తున్న తొలి హారర్ కామెడీ చిత్రం కావడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు