#SSMB29: 2028 వరకు రాజమౌళి చేతుల్లోనే మహేష్ బాబు ?

టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పాలి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా రాజమౌళి నిలిచాడు. ఇటీవల రాజమౌళి చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా హిట్టు అందుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి ప్రపంచ స్థాయికి ఎదిగిపోయాడు. హాలీవుడ్ సైతం… రాజమౌళి వైపు చూస్తోంది. ఇది ఇలా ఉండగా రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్టు మహేష్ బాబు తో చేయనున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేస్తాడు. ఈ సినిమా 2024 జనవరిలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారని ప్రచారం అయితే సాగుతోంది. ఇలాంటి తరుణంలో ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది.

2024 సంవత్సరంలో ఈ సినిమా ప్రారంభమై 2026 వరకు మొదటి పార్ట్ పూర్తి అవుతుందట. ఇక 2026 నుంచి 2028 వరకు రెండవ భాగాన్ని రాజమౌళి పూర్తి చేయనున్నాడట. దీనికోసం ఇప్పటికే భారీ ప్లాన్ కూడా చేస్తున్నాడట జక్కన్న. 2028 వరకు… మహేష్ బాబు… రాజమౌళి చేతిలోనే ఉంటాడన్నమాట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు