Sai Pallavi: ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న సాయిపల్లవి..?

సాయిపల్లవి.. ఇండస్ట్రీలో ఈ పేరుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్స్పోజింగ్ లేకుండా, మేకప్ లేకుండా, పాత్రకు బలం ఉన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది సాయి పల్లవి. సినీ పరిశ్రమలో నేచురల్ బ్యూటీ అనే పేరు సంపాదించుకుంది. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్డమ్ ఏ మాత్రం తక్కువగా లేదు. ఈమె ఓ గొప్ప నటి మాత్రమే కాదు ఓ గొప్ప డాన్సర్ కూడా. ఇక రెమ్యూనరేషన్ విషయంలో పెద్దగా డిమాండ్ చేయకపోగా.. నష్టపోయిన నిర్మాతలకు సాయి పల్లవి ఆ డబ్బులు తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఈమెకి మంచి క్రేజ్ ఉంది. అయితే తాజాగా సాయి పల్లవి గురించి కోలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. సాయి పల్లవికి కూడా ఓ సందర్భంలో సర్జరీ చేయించుకోలేక తప్పలేదట. అయితే ఏ విషయంలో సర్జరీ చేసుకుందంటే.. ఆమె డాన్స్ చేస్తున్న క్రమంలో కాలికి చిన్న గాయమైందని.. ఆ సమయంలోనే ఆమె సర్జరీ చేయించుకోవలసి వచ్చిందని సమాచారం.

అయితే ఇప్పటికీ ఆమె డాన్స్ చేసినప్పుడు ఆ కాలు నొప్పి వస్తూనే ఉంటుందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వార్త సాయి పల్లవి స్నేహితురాలి వల్ల బయటకి వచ్చిందట. ఇదిలా ఉంటే ఈ మధ్య ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదని తేలిపోయింది. తాజాగా తమిళ హీరో శివ కార్తికేయతో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు