Kotabommali PS : షూటింగ్ ఎక్కడ జరిగిందో అస్సలు ఊహించలేరు… నిర్మాతలకు భారీగా మిగిల్చిన డైరెక్టర్

రాజకీయాల్లో అవినీతి, అక్రమాలు, అనైతికత నేపథ్యంగా, పోలీస్ వ్యవస్థను నేతలు తప్పుడు పనులకు ఎలా వాడుకుంటారు అనే అంశంతో తెరకెక్కిన “కోట బొమ్మాళి పీఎస్” మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఓటు విలువ, రాజ్యాంగ విలువలను గుర్తు చేసే విధంగా రూపొందిన ఈ సినిమాలో శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. అర్జున ఫాల్గుణ, జోహార్ వంటి సినిమాలను తీసిన డైరెక్టర్ తేజ మారని ఈ మూవీ ని డైరెక్ట్ చేశారు.

నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ అయిన “కోట బొమ్మాళి పీఎస్” మూవీ ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తో 1. 75 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇక రెండో రోజు కూడా అదే ఊపుతో దూసుకెళ్తూ 2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు ఓపెనింగ్ డే కంటే 50% కలెక్షన్స్ పెరగడం విశేషం. మంచి ప్రేక్షకాదరణతో దూసుకెళ్తున్న ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఫిలింనగర్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే డైరెక్టర్ నిర్మాతలకు భారీగా మిగిల్చాడు అనే టాక్ నడుస్తోంది.

నిజానికి సినిమా అంటే మంచి లొకేషన్స్ ను ఎంచుకోవడం కూడా ముఖ్యమే. చిన్న సినిమాల విషయంలో ఇది మరింత కీలకమని చెప్పాలి. ఎందుకంటే బడ్జెట్ తక్కువగా ఉంటుంది కాబట్టి కరెక్ట్ లొకేషన్స్ ఎంచుకోకపోతే నిర్మాతల జేబులకు చిల్లు పడే అవకాశం ఉంటుంది. అయితే “కోట బొమ్మాళి పీఎస్” విషయంలో మేకర్స్ ఎంచుకున్న లొకేషన్స్ పరంగా నిర్మాతకు చాలా వరకు ఖర్చులు మిగిలాయట. “కోట బొమ్మాళి పీఎస్” మూవీ చాలా వరకు అడవిలోనే సాగుతుంది. మరి ఆ లొకేషన్ ఎక్కడ ? అన్నది అసలు మీ ఊహకు అందదు.

- Advertisement -

హైదరాబాదులోని బిహెచ్ఈఎల్ లో ఈ మూవీ షూటింగ్ చాలా వరకు జరిగిందట. మరికొంత షూటింగ్ మాత్రం బయట లొకేషన్లలో పూర్తి చేశారట. హైదరాబాదులోనే దాదాపు షూటింగ్ పూర్తి కానిచ్చేసినప్పటికీ, సినిమాను సిల్వర్ స్క్రీన్ పై వీక్షించిన ప్రేక్షకులు ఎవరూ అసలు గుర్తించలేరు. ఈ విషయం తెలిసిన సినీ ప్రియులు షాక్ కు గురవుతున్నారు. ఇలా తెలివిగా ఒకే లొకేషన్ లో చాలా వరకు సినిమాను పూర్తి చేసి తన పనితనంతో డైరెక్టర్ నిర్మాతలకు మరింత బడ్జెట్ ను తగ్గించాడన్న మాట.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు