Kareena Kapoor: సౌత్ పై మరో నార్త్ బ్యూటీ కన్ను.. ఎవరితో అంటే..?

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ నుంచి నటీనటులు, దర్శకులు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమా చేస్తే.. ఇక్కడి వారు వారి టాలెంట్ ను ప్రశంసించేవారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి అలా లేదు.. అక్కడి స్టార్ సెలబ్రిటీలే మన దగ్గరకు వచ్చి మరీ సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అంతలా సౌత్ సినీ పరిశ్రమ పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది. బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమాలే ఇప్పుడు బాలీవుడ్ తారలను సౌత్ వైపు చూసేలా చేశాయని చెప్పవచ్చు.. ఇకపోతే ఒకప్పుడు విలన్లు , హీరోయిన్లు మాత్రమే బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీకి వచ్చేవారు.. కానీ ఇప్పుడు హీరోలు కూడా ఏకంగా సౌత్ ఇండస్ట్రీలో నటించడానికి మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నుంచి చాలామంది హీరోలు సౌత్ స్టార్ హీరోల సినిమాలలో కీలకపాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోవైపు అసలు సౌత్ సినీ ఇండస్ట్రీ వైపే చూడని కొంతమంది బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్లు కూడా సౌత్ సినిమాలపై మోజు పడుతూ ఉండడం గమనార్హం.

సౌత్ పై మోజుపడుతున్న బాలీవుడ్ స్టార్స్ ..

అయితే ఇప్పుడు అక్కడ స్టార్ హీరోయిన్లు కూడా సౌత్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు.. ఈ మధ్యనే భార్య భర్తలు ఇద్దరూ కూడా సౌత్ సినిమాకు వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నో లవ్ , యాక్షన్ కామెడీ చిత్రాలలో నటించి అగ్ర హీరోయిన్ గా పేరుపొందిన హీరోయిన్ కరీనాకపూర్.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికే 17 ఏళ్లు అవుతోంది.. ఇంకా కొత్త హీరోయిన్ లాగానే కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ…. త్వరలోనే ది క్రూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .. ఈ చిత్రంలో ఎయిర్ హోస్ట్ గా కూడా కనిపించనుంది.. మరో ఇద్దరు కథానాయికకలతో ఆమె ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

కన్నడలో కరీనాకపూర్.

అలాగే గత కొద్దిరోజులుగా కన్నడలో ఒక పాన్ ఇండియా సినిమాలో కరీనాకపూర్ నటించబోతున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి.. ఈ విషయాన్ని ఈమె తాజాగా చెప్పకనే చెప్పేసింది.. ఇటీవల సోషల్ మీడియా అభిమానులతో కరీనాకపూర్ మాట్లాడుతూ.. తను రాబోయే సినిమాల గురించి పలు విషయాలను వెల్లడించింది.. త్వరలోనే తాను ఒక భారీ సినిమాతో దక్షిణాది సినిమాలో అడుగు పెట్టబోతున్నానని.. అది కూడా పాన్ ఇండియా చిత్రమని మొదటిసారి ఇలాంటి సినిమాలో పనిచేస్తున్నానంటూ వెల్లడించింది.

హీరో యష్ మూవీతో ఎంట్రీ..

కరీనా ఈ కామెంట్లు చేయడంతో..కచ్చితంగా ఈ సినిమా హీరో యష్ చేస్తున్న టాక్సిక్ సినిమా అని సోషల్ మీడియాలో అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరైతే ఇంకేదైనా సినిమా గురించి చెప్పాలనుకుంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కే జి ఎఫ్ చిత్రాలతో యష్ కూడా పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ అందుకున్నారు. ఇక చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని కొత్త సినిమా గురించి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.. ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో చేస్తున్నారు యష్.

కరీనాకపూర్ భర్త..

మరోవైపు కరీనాకపూర్ భర్త సైఫ్ అలీఖాన్ కూడా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.. గతంలో కూడా ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రంలో రావణాసురుడిగా నటించారు. ప్రస్తుతం అటు కరీనా ఇటు సైఫ్ అలీ ఖాన్ ఇద్దరూ కూడా సౌత్ ఇండస్ట్రీలో తమ హవా కొనసాగించాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు