Salaar: ప్రభాస్ మూవీనా? పృథ్వీరాజ్ మూవీనా? ఆడియన్స్ ను మోసం చేస్తున్నారా?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “సలార్” మూవీ రిలీజ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందంపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు ఇది ప్రభాస్ మూవీనా? లేకపోతే పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీనా? అంటూ చిత్ర బృందాన్ని నిలదీస్తున్నారు. ఇంతకీ వీరికి ఇంతలా కోపం ఎందుకు వచ్చింది? అసలు ఈ ప్రశ్నలు తలెత్తడానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

మరో 8 రోజుల్లో “సలార్” మూవీ థియేటర్లలో సందడి చేయబోతోంది. డిసెంబర్ 22న ఈ మోస్ట్ వైలెంట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా, అయినా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా, శృతిహాసన్ హీరోయిన్ పాత్ర పోషిస్తుంది. ఇక సినిమా రిలీజ్ కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే బుధవారం ఈ మూవీ నుంచి “సూరీడే” అనే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసింది. అంతకుముందు ఇదే విషయాన్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం “సలార్” టీంపై మండిపడడానికి ఇదే ఆజ్యం పోసింది.

నిజానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్, ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ “సలార్” మూవీని ప్రభాస్ మూవీ గానే చూస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సలార్ మూవీని తెరకెక్కించిన ఫిలిం మేకర్స్, నిర్మాణ సంస్థ ఈ మూవీని పృథ్వీరాజ్ మూవీగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అప్పటినుంచి ప్రభాస్ కంటే పృథ్వీరాజ్ కి చిత్ర బృందం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తోంది. తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ను చూసినా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పోస్టర్లో కేవలం పృథ్వీరాజ్ నీ మాత్రమే చూపించారు. ఇప్పటిదాకా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ పృథ్వీరాజ్ కలిసి ఉన్న కొన్ని పోస్టర్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులోనూ చాలావరకు పృథ్వీరాజే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు. చాలా పోస్టర్స్ లో ప్రభాస్ కేవలం బ్యాగ్రౌండ్ కె పరిమితమై కనిపించడం, కొన్ని చోట్ల బ్లాక్ షేర్ తో ప్రభాస్ ముఖాన్ని సరిగ్గా చూపించకపోవడం చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

అసలు “సలార్” ప్రభాస్ మూవీనా? లేక పృథ్వీరాజ్ మూవీనా? ప్రమోషన్స్ చూస్తుంటే పృథ్వీరాజ్ హీరో అన్నట్లుగా కనిపిస్తోంది. ప్రభాస్ మూవీ అంటూ ఆడియన్స్ ను మోసం చేస్తున్నారా? అంటూ నిర్మాతలను నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై రూమర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సలార్ మూవీ ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ కంటే పృథ్వీరాజ్ క్యారెక్టర్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుందని, అందుకే పృథ్వీరాజ్ నే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారని, ప్రభాస్ సలార్ ఫస్ట్ పార్ట్ లో సెకండ్ హాఫ్ లోని ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం పృథ్వీరాజ్ చుట్టే కథ అంతా తిరుగుతుందని, సెకండ్ పార్ట్ లో మాత్రమే ప్రభాస్ క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుందని వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలే ప్రభాస్ అభిమానుల్లో అసహనం నింపేస్తున్నాయి. మరి ఈ రూమర్స్ పై క్లారిటీ రావాలంటే డిసెంబర్ 22న థియేటర్లలో సినిమాను వీక్షించాల్సిందే.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు