Samuthirakhani: పవన్ డబ్బింగ్ చెప్పింది దానికేనా? లేక మొత్తమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన సినిమా “బ్రో”. ఈ సినిమా సముద్రఖని వినోదయ సితం కి రీమేక్ గా తెరకెక్కించాడని తెలిసిందే. సినిమా స్టార్ట్ అయినపుడు ఎలాంటి అంచనాలు లేకపోయినా ఎప్పుడైతే త్రివిక్రమ్ ఎంటరయ్యాడో అప్పట్నుంచే ఫ్యాన్స్ కి ఒక నమ్మకం ఏర్పడింది. దానికి తోడు త్రివిక్రమ్ స్టయిల్ల్లో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కూడా ఓ రేంజ్ లో ఉండడంతో కామన్ ఆడియన్స్ సైతం ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.

అయితే అసలు విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోగా, డబ్బింగ్ పనులను మాత్రం పూర్తిగా ఫినిష్ చేయలేకపోయింది. తాజాగా ఈ సినిమా టీజర్ ని జూన్ 29న రిలీజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. దానికోసం పవన్ కళ్యాణ్ జనసేన కోసం ప్రచారం చేస్తున్న ఊరికి వెళ్లి మరీ సముద్రఖని పవన్ కళ్యాణ్ తో డబ్బింగ్ చెప్పించాడు. అయితే ఇక్కడే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. బ్రో సినిమాకి పవన్ కళ్యాణ్ టీజర్ కి మాత్రమే డబ్బింగ్ చెప్పాడా? లేక సినిమా మొత్తానికి డబ్బింగ్ చెప్పాడా? అనేది ఫ్యాన్స్ కి కంఫ్యూజింగ్ గా మారింది.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ సినిమాకి టైమ్ కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడే “బ్రో” సంబంధించిన పనులన్నీ చేయించుకోవడం మంచిదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ పవన్ టీజర్ కి మాత్రమే డబ్బింగ్ చెప్తే సినిమా రిలీజ్ టైమ్ కి ఎదో ఒక ఇబ్బంది రావొచ్చని అంటున్నారు. అలా కాక సినిమా మొత్తానికి డబ్బింగ్ చెప్పేస్తే ఇక పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమాకి సంబంధించి ప్రమోషన్ పనులు తప్ప ఇంకేమి ఉండవు. మరి దీని గురించి క్లారిటీ రావాలంటే అది డైరెక్టర్ సముద్రఖనియే వివరణ ఇవ్వాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossips

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు