Mark Antony: సూపర్ స్టార్ తో సినిమా తీయకుండా వదలను.. ఎస్.జె.సూర్య!

Mark Antony:

ప్రముఖ తమిళ డైరెక్టర్, నటుడు ఎస్.జె. సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు దర్శకుడిగా ఒక ఊపు ఊపిన ఈ డైరెక్టర్, ఇప్పుడు నటుడిగాను అలరిస్తున్నాడు. తాజాగా విశాల్ తో కలిసి మార్క్ ఆంటోనీ లో స్పెషల్ రోల్ చేసిన ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ సందర్భంగా తాను తెలుగులో వర్క్ చేసిన ఆక్టర్స్ గురించి ప్రస్తావిస్తూ తెలుగులో కూడా తాను డైరెక్ట్ చేశాను. నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సినిమా తెలుగులోనే చేశాను. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఖుషి సినిమా కావడం నా అదృష్టం. అంతే కాదు ఆ సినిమా రీ రిలీజ్ అయ్యి కూడా బ్లాక్ బస్టర్ అవడం నాకు ఎంతో నచ్చిందని అన్నాడు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా తాను నాని అనే సినిమా తీశానని, అయితే అనుకోకుండా ఆ సినిమా ప్లాప్ అయింది అన్నాడు. అయితే తాను వర్క్ చేసిన హీరోలందరికీ హిట్లిచ్చానని, విజయ్, అజిత్, పవన్ కళ్యాణ్ లకి కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చాను. కానీ మహేష్ బాబు కి మాత్రం ఇవ్వలేకపోయాను. ఎలాగైనా ఆయనతో మరో సినిమా తీసి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఖచ్చింతంగా ఇస్తానని ఫ్యాన్స్ కి మాట ఇస్తున్నానని అన్నారు.

ఇక మార్క్ ఆంటోనీ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో విశాల్ తో పాటు తాను కూడా డబల్ ఆక్షన్ లో నటించానని, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆక్షన్ తో పాటు కామెడి కూడా అలరిస్తుందని అన్నాడు. మార్క్ ఆంటోనీ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు