Mark Antony: ‘అభినయ’ పాన్ వరల్డ్ యాక్ట్రెస్… సునీల్ ఎలివేషన్!

Mark Antony:

టాలీవుడ్ లో తన కామెడీ కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించిన ఆక్టర్ సునీల్. కమెడియన్ గానే కాకుండా కొన్నాళ్లపాటు హీరోగా పలు సూపర్ హిట్ సినిమాలు చేసిన సునీల్, కలర్ ఫోటో, పుష్ప వంటి సినిమాల్లో విలన్ గాను నటించి తన ప్రతిభ చాటుకున్నాడు. తాజాగా తమిళ్ లో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ లో విలన్ గా నటించడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు నితిన్ గెస్ట్ గా హాజరయ్యాడు.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సునీల్ మాట్లాడుతూ ఓ సందర్భంలో నటి అభినయని ఆకాశానికెత్తేసాడు. అభినయ అంటే మూగ చెవుడు గల అమ్మాయి అని అందరికి తెలిసిందే. అయితే ఆ లోపం ఉన్నా కూడా తన నటనతో ఆడియన్స్ ని మెప్పించింది. “శంభో శివ శంభో” ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాల్లో తన పెరఫార్మన్స్ తో అదరగొట్టింది. ఇక తాజాగా మార్క్ అంటోని సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సందర్భంగా అభినయ గురించి మాట్లాడుతూ తాను పాన్ వరల్డ్ యాక్ట్రెస్ అని చెప్పుకొచ్చాడు.

ఒకప్పుడు హాలీవుడ్ లో మూకీ సినిమాలు వచ్చేవి. చార్లీ చాప్లిన్ వంటి దిగ్గజ నటులు తమ ఎక్స్ప్రెషన్స్ తోనే ఆక్ట్ చేసేవారు. ఇప్పుడు అభినయ కూడా వాళ్ళ రేంజ్ లో తన పెరఫార్మన్స్ ఇస్తుంది. పైగా తానూ చేసే యాక్టింగ్ లో ఇప్పటి హీరోయిన్లు సగం కూడా చేయలేకపోతున్నారని అన్నాడు. ఇక విశాల్ నటించిన ఈ మార్క్ ఆంటోనీ సినిమా సెప్టెంబర్ 15న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు