RamaBanam: కలగూర గంపను నమ్ముకున్న గోపీచంద్ – వర్కౌట్ అవుతుందా..?

కెరీర్ తొలినాళ్లలో విలన్ వేషాలు వేసి ఆ తర్వాత యజ్ఞం, లక్ష్యం లాంటి బ్లాక్ బస్టర్స్ అందుకొని మాస్ హీరోగా సెటిల్ అయ్యాడు గోపీచంద్. ప్రస్తుతం గోపీచంద్ శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. గతంలో లక్ష్యం. లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఫ్యామిలి ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఆసక్తి పెంచేలా ఉంది. గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా మే 5న థియేటర్లలో సందడి చేయనుంది.

ఇటీవల వరుస డిజాస్టర్స్ తో సతమతం అవుతున్న గోపీచంద్ కి ఈ సినిమా కీలకంగా మారింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ చూసాక కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.సినిమా యూనిట్ చెప్తున్నంత కొత్తగా ట్రైలర్లో ఏమి లేదని అంటున్నారు. ఆర్గానిక్ వ్యాపారిగా కనిపిస్తున్న జగపతి బాబుకి, అతన్ని వ్యతిరేకించే విలన్ కి మధ్య నడుస్తున్న కథలో గోపీచంద్ యాక్షన్ సీన్స్, మాస్ డైలాగులు కలగూర గంప లాగ ఉందని అంటున్నారు. గతంలో ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ లో చాలా సినిమాలే వచ్చాయి,పాత కథకి ఆర్గానిక్ వ్యవసాయం అన్న కొత్త అంశాన్ని జోడించినంత మాత్రాన కొత్తదనం ఎలా వస్తుందని అంటున్నారు.

గతంలో రెండు హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ అన్న ఒక్క అంశం మినహా ఏ పాజిటివ్ అంశం లేని ఈ సినిమా గోపీచంద్ కెరీర్ కి అత్యంత కీలకంగా మారింది. గోపీచంద్ ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ద్వారా హిట్ అందుకొని మళ్ళీ ట్రాక్ లో పడతాడా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు