Vijaykanth: విజయ్ కాంత్ వల్లే చిరంజీవి స్టార్ హీరో అయ్యాడా..?

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించారు. ఆయన కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ముందు వరుసలో ఉండే చిత్రం ఠాగూర్. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే విజయ్ కాంత్ హీరోగా మురుగదాస్ తమిళ్ లో తెరకెక్కించిన రమణ చిత్రానికి ఇది అఫీషియల్ రీమేక్.

ఈ చిత్రంలో అవినీతిపై ఠాగూర్ సాగించే పోరాటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందులోని పలు సన్నివేశాలు ఇప్పటికీ అభిమానులుని ఉర్రూతలూగిస్తుంటాయి. అయితే ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం చిరంజీవితో పాటు రాజశేఖర్ సైతం పోటీపడ్డారు. కానీ అల్లు అరవింద్, చిరంజీవి గట్టిగా ప్రయత్నించడంతో రీమేక్ రైట్స్ వారి సొంతం అయ్యాయి. ఇక చిరు పిలిచి మరీ వివి వినాయక్ కి ఈ ఆఫర్ ఇవ్వడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి మాటలు రాయగా.. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఇక జ్యోతిక మరియు శ్రీయ హీరోయిన్లుగా నటించారు. అలాగే సునీల్ ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమాకి ముందు ఇంద్ర సినిమాలో నటించిన చిరు.. ఠాగూర్ సినిమాతో ఇక ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా మారిపోయాడు. అలా విజయ్ కాంత్ సినిమా ద్వారానే చిరంజీవి స్టార్ హీరో అయ్యాడు అంటూ ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

- Advertisement -

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు