Pushpa : షాకింగ్ వీడియో… “పుష్ప” మ్యానరిజాన్ని బన్నీ ఇక్కడ కాపీ కొట్టాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప”. 2021 డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. 170 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన “పుష్ప” ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు 373 కోట్ల గ్రాస్ వసూలు చేసి టాలీవుడ్ కు చెందిన మరో బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీగా రికార్డును క్రియేట్ చేసింది.

ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటన, హీరోయిన్ రష్మిక మందన్న, సమంత స్పెషల్ సాంగ్ “ఊ అంటావా మావా”, డీఎస్పీ బిజిఎం, సుకుమార్ ‘పుష్ప’ కథను తెరపై చూపించిన తీరుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన టైంలో అల్లు అర్జున్ మ్యానరిజం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మ్యానరిజాన్ని అల్లు అర్జున్ ఎక్కడ నుంచి కాపీ కొట్టాడో తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

“పుష్ప” మూవీ రిలీజ్ అయిన టైంలో ఒక చేయి పైకెత్తి బన్నీ నడిచే తీరు, “శ్రీవల్లి” సాంగ్ లో ఆయన వేసిన హుక్ స్టెప్ యూత్ ను ఊపేసాయి. టిక్ టాక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో సునామీని సృష్టించాయి. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినిమా ప్రియులు పుష్ప మ్యానరిజాన్ని కాపీ కొడుతూ చేసిన వీడియోలు సైతం ఈ సినిమా కలెక్షన్లకు మరింత ఊపునిచ్చాయి. మరి ప్రేక్షకులను ఇలాంటి మ్యాజిక్ లో ముంచేసిన “పుష్ప” మ్యానరిజాన్ని అల్లు అర్జున్ తన రియల్ లైఫ్ లో కలిసిన ఒక వ్యక్తి నుంచి కాపీ కొట్టారు అనే విషయం తెలుసా? కొన్నేళ్ల క్రితం ఓ మీటింగ్ కు హాజరైన అల్లు అర్జున్ అక్కడ యూత్ తో కలిసి మాట్లాడారు.

- Advertisement -

అంతేకాకుండా యాక్టింగ్ స్కిల్స్ కు సంబంధించిన క్లాసును తీసుకున్నాడు. అలా స్టూడెంట్స్ ను ఇన్స్పైర్ చేస్తున్న సమయంలోనే అల్లు అర్జున్ కు ఒక వ్యక్తి డిఫరెంట్ మ్యానరిజంతో కనిపించాడు. అప్పుడు జరిగిన ఆ సంఘటనను గుర్తుపెట్టుకుని మరి “పుష్ప” టైంలో కొత్తగా ఉంటుందని ఈ మ్యానరిజాన్ని ఉపయోగించాడు అల్లు అర్జున్. అలా నిజ జీవితంలో ఒక మనిషికి ఉన్న ఈ వింత మ్యానరిజాన్ని కాపీ కొట్టి, “పుష్ప” సినిమాలో వాడుకుని, దాన్ని అంటువ్యాధిలా అందరికీ అంటించాడు అల్లు అర్జున్.

సినిమాలో చూసాం కాబట్టి అది స్టైల్ అనుకుని అలాగే అనుసరించడానికి ట్రై చేసాం. కానీ అలాంటి వ్యక్తి ఎవరైనా నిజజీవితంలో కనిపిస్తే చూసి నవ్వుకుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అది గుర్తుపెట్టుకుని మరీ ఇలా పాపులర్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా ప్రస్తుతం “పుష్ప 2” మూవీ షూటింగ్ దశలో ఉంది. ఫస్ట్ పార్ట్ ను మించిపోయేలా రెండో పార్ట్ ఉండబోతుందని సమాచారం. ఇక సీక్వెల్ గా తెరకెక్కుతున్న “పుష్ప 2” మూవీ 2024 ఆగస్టులో రిలీజ్ కాబోతోంది.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు