Shruti Hassan: అది శృతిహాసన్ రేంజ్ అంటే.. మహేష్ , ప్రభాస్ విషయంలో ఏం జరిగిందంటే.?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె ఒక హీరోయిన్ మాత్రమే కాదు మంచి సింగర్ కూడా పలు ఆల్బమ్ సాంగ్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సినిమాలలో చేసినా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సినిమాల పరంగా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైన శృతిహాసన్ వ్యక్తిగతపరంగా వార్తల్లో నిలిచింది. ఇద్దరి ముగ్గురితో ప్రేమాయణం నడిపి.. లవ్ లో బ్రేకప్ అయ్యి మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.

ఇప్పుడు డూడల్ ఆర్టిస్ట్ శాంతన్ హజారికతో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అతనితో లివింగ్ రిలేషన్ లో ఉందని సమాచారం. బాధ నుంచి పూర్తిగా తేరుకున్న ఈమె మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తోంది. ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది .అంతేకాదు ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా శృతిహాసన్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది .అదృష్టం అంటే ఈమెదే అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే సాధారణంగా ఒక సినిమాలో హీరోయిన్ సెలెక్ట్ అయిన తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఏర్పడితే ఆ హీరోయిన్స్ స్థానంలో ఇంకొకరు వస్తారు అన్న విషయం తెలిసిందే . అయితే మళ్లీ ఆ స్టార్ హీరోతో నటించే అవకాశం వస్తుందా రాదా అన్నది ప్రశ్నార్ధకంగానే మారుతుంది. కానీ శృతిహాసన్ కి మాత్రం ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు తప్పిపోయినా.. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆమెనే హీరోయిన్గా తీసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. ప్రభాస్ , మహేష్ బాబు విషయంలో కూడా ఇదే జరిగింది.

- Advertisement -

మహేష్ బాబు నటించిన బిజినెస్ మాన్ సినిమాలో మొదట శృతిహాసన్ ని అనుకున్నారు
కానీ కొన్ని కారణాలవల్ల ఆమెను తప్పించి కాజల్ ను ఫైనల్ చేయడం జరిగింది. దాంతో ఆమె అభిమానులు చాలా బాధపడ్డారు. కానీ మూడేళ్ల తర్వాత మళ్లీ మహేష్ బాబుకు జోడిగా శ్రీమంతుడు సినిమాలో నటించింది శృతిహాసన్. ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.

ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. రెబల్ సినిమాలో కూడా మొదట శృతిహాసన్ ను హీరోయిన్ గా అనుకున్నారు.. కానీ కొన్ని కారణాలవల్ల శృతిహాసన్ ఆ సినిమా నుంచి తప్పుకుంది. అయితే మళ్లీ 11 ఏళ్ల తర్వాత ప్రభాస్ కి జోడిగా సలార్ లో కనిపించింది శృతిహాసన్. దీన్ని బట్టి చూస్తే శృతిహాసన్ కి స్టార్ హీరోయిన్ స్టేటస్ ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. సాధారణంగా హీరోయిన్ లు కొన్ని సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలో ఫేడౌట్ అవుతూ ఉంటారు. కానీ శృతిహాసన్ మాత్రం సంవత్సరాలు తరబడి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు