Kollywood: ఏ.ఆర్ రహమాన్ ఎందుకు మతం మారాడో తెలుసా?

సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరుగా ఉన్న ఏ.ఆర్ రహమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తమిళనాడుకి చెందిన ఇతను పాన్ ఇండియా అంతటా చాలా భాషల సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు. అయితే కొంత కాలం నుండి ఈయన సినిమాలు చేయడం తగ్గించాడు. సెలెక్టడ్ మూవీస్ ని మాత్రమే చేస్తున్నా బిజీగా ఉన్నాడు. ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాడు రెహమాన్.

అయితే రహమాన్ గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండదు. నిజానికి ఆయన పుట్టుకతో ముస్లిం కాదు. మధ్యలో మతం మారారు. అదెలాగంటే రహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. ఒకప్పుడు వీళ్ళు హిందువులే. రెహమాన్ తండ్రి పేరు కె. శేఖర్. తల్లి కస్తూరి. రహమాన్ తండ్రి వాయిద్య కళాకారుడు. గుళ్లో భజనలు చేసేవారు. పదేళ్ల లోపు ఉన్నప్పుడే తండ్రి చనిపోవడంతో రహమాన్ తండ్రి వాయించే వాయిద్యాలని తీసుకుని చిన్న సంగీత దర్శకుల మధ్య అసిస్టెంట్ గా చిన్న చిన్న పనులు చేస్తూనే అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ని నేర్చుకున్నాడు.

అయితే రహమాన్ తల్లికి ఆధ్యాత్మిక భక్తి ఎక్కువ. వాళ్ళు హిందూ దేవుళ్ళనే కాకుండా, జీసస్ ని, అల్లా ని కూడా పూజించేవారు. ఇలా ఓ సందర్భంలో తల్లి కొడుకులు కలిసి నెల్లూరు లో, తడ దగ్గరలోని సూఫీ ప్రవక్ర కరీముల్లా షా ఖాద్రీ బోధనలకు ఆకర్షితులై వీరి కుటుంబం 1989వ సంవత్సరంలో ఇస్లామ్‌లోకి మారింది. అప్పుడు రహమాన్ కూడా తన పేరు అప్పుడు దిలీప్ కుమార్ కాబట్టి, పేరు మార్చుకోవచ్చా, అని అక్కడి పీర్ దర్గాలో అడిగితే అబ్దుల్ రెహమాన్ అని పెట్టుకో అని చెప్పారట. ఇక తన తల్లి ఆ పేరులో అల్లా రఖా కూడా యాడ్ చేసింది. అప్పుడు దిలీప్ కుమార్ గా ఉన్న రహమాన్ , అల్లా రఖా రహమాన్ (ఏ. ఆర్ రహ్మన్) గా మారాడు.

- Advertisement -

ఇక ఆ తర్వాత తల్లి కస్తూరి కూడా తన పేరు కరిమా గా మార్చుకోగా, ఇప్పటికి కడప లోని పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాలను సందర్శిస్తారు. ఇక ప్రస్తుతం రహమాన్ తమిళ్ లో పలు స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ ఇస్తుండగా, తెలుగులో RC16 సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు