aditi shankar : టాలీవుడ్ కు ఎంట్రీ

తమిళ స్టార్ దర్శకుడు శంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లమ్స్ కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. దక్షిణాది సినిమాలతో మొత్తం ఇండియా మాట్లాడుకునేలా చేసిన దర్శకుల్లో శంకర్ ఒకరు. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను తమిళ డబ్బింగ్ సినిమాలతో మాత్రమే పలకరించాడు. తొలిసారి తెలుగులో ఈ అగ్ర దర్శకుడు సినిమా చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో RC15 చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా, శంకర్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా తన కూతురు అదితి శంకర్ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇటీవల అడుగు పెట్టింది. కార్తి కథానాయకుడిగా నటించిన ‘విరుమన్’ సినిమా ద్వారా తమిళ తెరకు పరిచయం కానుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత శివ కార్తికేయన్ కు జోడీగా ‘మావీరన్’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే అదితి శంకర్ టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్టు సమాచారం. పెద్ద బ్యానర్లో, పేరున్న హీరో సరసన అదితి నటిస్తుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. శంకర్ కూతురు అంటే ఎలా ఉంటుంది.. ఎలా చేస్తుందనే ఆసక్తి ఇక్కడ కూడా ఉండటం సహజం. అ అంచనాలను మించి అదితి శంకర్ తెలుగు ప్రాజెక్టు ఉంటుందని తెలుస్తుంది. దీని పూర్తి వివరాలు త్వరలోనే తెలియనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు