NBK 109: NBK 109 లో కలర్ ఫోటో హీరోయిన్..!

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటికే సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలయ్య.. దసరా సందర్భంగా భగవంత్ కేసరి సినిమాతో మరో పవర్ ఫుల్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం దర్శకుడు బాబి కొల్లి (కె.ఎస్ రవీంద్ర) తో ఓ పెద్ద బడ్జెట్ సినిమా షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇది బాలకృష్ణ కి 109వ చిత్రం. అయితే ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. సితార ఎంటర్టైర్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా యొక్క షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మూవీ యూనిట్ ప్రారంభించింది. ప్రస్తుతం మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ హీరోయిన్ చాందిని చౌదరి ఓ కీలకపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి దర్శకుడు బాబీతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చాందిని. ఈ ఫోటోకి “కూల్ కిడ్స్” అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు