Extra Ordinary Man : రాజశేఖర్ కి ఏమైంది? ఇలాంటి రోల్స్ చేస్తే విలన్ అయినట్టే !

కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ పాత్రను చూసిన ప్రేక్షకులు రాజశేఖర్ కు అసలు ఏమైంది? ఇలాంటి రోల్స్ చేస్తే ఆయన విలన్ అయినట్టే అని అంటున్నారు. అసలు విషయంలోకి వెళ్తే…

యంగ్ హీరో నితిన్ క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాజశేఖర్ కీలకపాత్ర పోషించాడు. అయితే మూవీలో రాజశేఖర్ పాత్రను చూసిన ప్రేక్షకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ ఎంట్రీ క్యూరియాసిటీని పెంచేస్తుందని, కానీ మూవీలో అందరూ అంచనా వేసినట్టుగా కాకుండా, అతని పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదనేది ఇప్పుడు నడుస్తున్న టాక్. కేవలం సినిమాను ముగించడానికి మాత్రమే ఆయన పాత్రను వాడుకున్నాడు డైరెక్టర్. గతంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన ఈ సీనియర్ యాక్టర్ ఇలాంటి రోల్ కు ఎలా ఒప్పుకున్నాడు?

నిజానికి రాజశేఖర్ విలన్ గా చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. మరి కెరీర్లో మరో ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయన ఇంత కేర్ లెస్ గా ఎలా వ్యవహరించాడు అనేది అభిమానులకు సైతం అర్థం కావట్లేదు. అప్పట్లో హీరోలుగా నటించిన జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోలు టాలీవుడ్లో ఇప్పుడు పవర్ ఫుల్ విలన్లుగా మారిపోయారు. విలన్ గా నిలదొక్కుకోవడానికి శ్రీకాంత్ ఇంకా కష్టపడుతున్నాడు. కానీ జగపతిబాబు విలన్ గా హీరోల కంటే ఎక్కువ పాపులారిటీనే సంపాదించుకున్నాడు. లెజెండ్ వంటి మూవీలో బాలయ్యకు విలన్ గా ధీటుగా నటించి తనలోని యాక్టింగ్ టాలెంట్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి హీరోల కంటే ఎక్కువ బిజీ అయిపోయాడు. దీంతో అప్పటి సీనియర్ హీరోలు అంతా జగపతిబాబు బాటలో నడవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్టైన్  చేసిన రాజశేఖర్ విలన్ గా మారబోతున్నాడు అంటే అంచనాలు భారీగా ఉంటాయి. అలాగే ఆ మూవీ రాజశేఖర్ కెరీర్ కు కూడా టర్నింగ్ పాయింట్ అవుతుంది.

- Advertisement -

కానీ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీలో రాజశేఖర్ పాత్ర చూస్తుంటే ఆయన దీన్ని అంత సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. నిజానికి రాజశేఖర్ కు విలన్ గా చేయడం ఇష్టం లేదని, ఆయన ఇంకా హీరో గానే కనిపించాలని అనుకుంటున్నాడని ఇన్సైడ్ వర్గాల టాక్. కానీ తమకున్న అప్పుల నేపథ్యంలో కుటుంబం బలవంతం వల్ల రాజశేఖర్ ఈ పాత్రను చేయడానికి ఒప్పుకున్నాడట. ఏదైతేనేం ఈ మూవీలో రాజశేఖర్ పాత్ర ఆయన అభిమానులను అసంతృప్తికి గురి చేసింది అన్నది మాత్రం నిజం. మరి ఈ హీరోకు విలన్ గా అవకాశాలు వస్తాయా ? అంటే సందేహమే.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు