Dil Raju : దిమ్మతిరిగే పారితోషికం అడిగిన చిరు… దెబ్బకు హోల్డ్ లో ప్రాజెక్ట్

టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోల హవా నడుస్తోంది. ఇటీవల బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ తో మరోసారి ఫామ్ లోకి రాగా, మరోవైపు చిరంజీవి కూడా అదే ట్రాక్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బడా ప్రొడ్యూసర్ సైతం ఈ క్రేజీ స్టార్స్ తో సినిమాలో చేయడానికి బాగా ఆసక్తిని కనబరుస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు బాలకృష్ణ లాంటి వెటరన్ యాక్టర్స్ తో వర్క్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. సరైన స్క్రిప్ట్ కోసం ఈ నిర్మాత ప్రయత్నిస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి అగ్ర నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా రాబోతుందని ప్రచారం జరిగింది.

సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిని దృష్టిలో ఉంచుకుని ఎంగేజింగ్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు. ఈ ప్రాజెక్టుకు దిల్ రాజు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకేముంది దిల్ రాజు ఎలాంటి ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపిస్తాడో అందరికీ తెలిసిందే. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ లో ఒక్క ప్లాఫ్ కూడా లేదు. మరి వీరిద్దరూ కలిసి మెగాస్టార్ తో సినిమా చేస్తున్నారు అంటే మెగా ఫ్యాన్స్ కి ఇంతకంటే ఇంకేం కావాలి. ఈ వార్త బయటకు రాగానే మెగా ఫాన్స్ అంత ఫుల్ ఖుషి అయ్యారు. అయితే వాళ్ల ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిందట. దానికి కారణం కూడా మెగాస్టార్ చిరంజీవి అని తెలుస్తోంది.

ఈ ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి చర్చించడానికి దిల్ రాజు చిరంజీవిని కలిశారట. స్టోరి ఓకే కానీ రెమ్యూనరేషన్ విషయంలోనే తేడా కొట్టిందట. చిరంజీవి కోట్ చేసిన రెమ్యూనరేషన్ తో దిల్ రాజుకు మైండ్ బ్లాక్ అయిందట. ఈ దెబ్బతో ప్రస్తుతానికి ఈ మూవీని హోల్డ్ లో పెట్టాలని నిర్ణయించుకున్నాడట దిల్ రాజు. చిరంజీవి సినిమాలు థియేటర్లలో మంచి వసూళ్లను సాధిస్తూ మేకర్స్ కు భారీ లాభాలు గడించి పెడుతున్నాయి. అయితే ఒకవేళ మూవీ ప్లాఫ్ అయితే డిజాస్టర్ కూడా అదే రేంజ్ లో పడి నిర్మాతలను నిండా ముంచేస్తున్నాయి. ఇటీవల వచ్చిన భోళా శంకర్ మూవీనే అందుకు నిదర్శనం. ఈ ప్లాఫ్ మూవీతో అనిల్ సుంకర భారీ నష్టాన్ని చవి చూడగా, వాల్తేరు వీరయ్య మూవీ హిట్ కావడంతో మైత్రి మూవీ మేకర్స్ వారు మంచి లాభాలను ఆర్టించారు. ఇక లెక్కల విషయంలో స్ట్రిక్ట్ గా ఉండే దిల్ రాజు ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో ఉంచాడు. అనిల్ రావిపూడి, రవితేజ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడు ఇప్పుడు దిల్ రాజు. మరి అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి, దిల్ రాజు కాంబోలో ఈ క్రేజీ మూవీ పట్టాలెక్కుతుందా? లేదంటే మొత్తానికే మూలన పడుతుందా? అనేది వేచి చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు