Extra Ordinary Man : శ్రీలీల ఎక్స్ట్రా ఆర్డినరీ హీరోయినేం కాదు… దీంతోనే తేలిపోయింది

క్రేజీ హీరోయిన్ శ్రీలీల టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆమె అందానికి, డాన్స్ కు ఫిదా అయిన యూత్ వెండితెరపై శ్రీ లీలను చూడడానికి బాగా ఇష్టపడుతున్నారు. ఇక మేకర్స్ కు కావాల్సింది కూడా అదే. అందుకే ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అయితే వాటిని ఉపయోగించుకోవడంలో మాత్రం శ్రీలీల తడబడుతోంది. రీసెంట్ గా వచ్చిన వరుస ప్లాఫ్ లే అందుకు నిదర్శనం.

తాజాగా ఈ బ్యూటీ యంగ్ హీరో నితిన్ సరసన హీరోయిన్ గా “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీలో కనిపించింది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీలో శ్రీలీల పాత్రను చూసి ఆమె అభిమానులు సైతం షాక్ అయ్యారు. సినిమా రిలీజ్ కు ముందే అందరూ అనుకున్నట్టుగానే శ్రీలీల కేవలం కొన్ని సన్నివేశాలు, పాటలలో మాత్రమే కనిపించింది. అసలు ఆమె పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఇలాంటి తరుణంలో ఆమె ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రలను ఎందుకు ఎంచుకుంటుంది అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న.

రీసెంట్ గా వచ్చిన ‘ఆదికేశవ’ సినిమాలో సైతం ఈ బ్యూటీ హీరోయిన్ గా కనిపించింది. అయితే పేరుకే హీరోయిన్ కానీ ఆ సినిమాలో ఈ అమ్మాయి పాత్రకు అసలు ఇంపార్టెన్స్ లేనేలేదు. పైగా రొటీన్ స్టోరీతో వచ్చిన ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి శ్రీలీల తప్పు చేసిందని విశ్లేషకులు కామెంట్ చేశారు. ఇప్పుడు “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ విషయంలో కూడా సేమ్ తప్పును రిపీట్ చేసింది శ్రీలీల. తన క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ లేకపోయినా ఈ సినిమాను ఒప్పుకుంది. అలాంటి నిర్ణయం తీసుకుని థియేటర్లో ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. ఈ బ్యూటీ ‘ధమాకా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినప్పుడు శ్రీలీల ఎక్స్ట్రా ఆర్డినరీ హీరోయిన్ అని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం వరుస డిజాస్టర్లు చవిచూస్తున్న శ్రీలీల అనుకున్నంత ఎక్స్ట్రా ఆర్డినరీ హీరోయిన్ ఏం కాదు అనే విషయం ఇప్ప్పుడు తేలిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

- Advertisement -

ఇక ఈ రెండు సినిమాల ఎఫెక్ట్ ఆమె కెరీర్ పై పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బ్యూటీ నెక్స్ట్ మూవీ “గుంటూరు కారం”. ఇప్పుడు అందరి దృష్టి ఆ మూవీపైనే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఈ సినిమాలో శ్రీలీల పాత్ర ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు ఆమె అభిమానులు. మరి శ్రీలీల “గుంటూరు కారం” మూవీతోనైనా తన ఫ్యాన్స్ ను డిసప్పాయింట్మెంట్ నుంచి బయట పడేస్తుందా? లేదంటే ఇలాంటి క్యారెక్టర్లే చేస్తూ రొటీన్ హీరోయిన్లలాగా మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు