Bhola Shankar – NBK108 : మిక్స్… రీ.. మిక్స్ టైం

టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ టాప్ హీరోలు ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ ను సాధించారు. దీంతో వీరికి వయసు పెరిగినా, సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లు కూడా వచ్చాయి.

కాగా “వాల్తేరు వీరయ్య” తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న మూవీ “భోళా శంకర్”, “వీర సింహ రెడ్డి” తర్వాత నందమూరి బాలయ్య చేస్తున్న చిత్రం NBK108. చిరంజీవి “భోళా శంకర్” చిత్రం మెహార్ రమేష్ దర్శకత్వంలో వస్తుండగా, బాలయ్య NBK108 అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రానుంది. ప్రస్తుతం ఈ సినిమాల చిత్రకరణ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తోంది.

ఈ రెండు సినిమాల్లో తమ పాత పాటలను రీమిక్స్ చేయించాలని హీరోలు చిరంజీవి, బాలయ్య ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో అప్పట్లో ఎన్నో సంచలనాలను నమోదు చేసిన “రామ్మా చిలుకమ్మా…” (చూడాలని ఉంది) సాంగ్ ను రీమిక్స్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారట. అలాగే బాలయ్య నటిస్తున్న NBK108లో సూపర్ హిట్ సాంగ్ “అందాల ఆడ బొమ్మ…” (సమరసింహారెడ్డి)ని రీమిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

- Advertisement -

ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్.. “అమిగోస్” సినిమాలో బాలయ్య ఆడిపాడిన “ఎన్నో రాత్రులు వస్తాయి కానీ…” అనే సాంగ్ ను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. దీంతో ఈ అగ్ర హీరోలు తము ఆడిపాడిన పాటలనే రీమిక్స్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకనట రాలేదు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు