Adipurush: రామ నామ జపం చేస్తున్న ఇండస్ట్రీ – స్ట్రాటజీ ఏంటీ..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ సినిమాలు వచ్చి చాలా కాలం అయిన కారణంగా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆదిపురుష్ బాటలోనే ఇంకో సినిమా రాబోతున్నట్లు సమాచారం అందుతోంది. బాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ లు జంటగా రామాయణం ఆధారంగా ఓ సినిమా త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఇప్పటిదాకా రామాయణం ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ చాలావరకు క్లాసిక్ మూవీస్ గా నిలిచాయి. రామాయణంలో ఓక సినిమాకు కావాల్సిన సెంటిమెంటల్ డ్రామా ఉండటమే ఇందుకు కారణం. బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి రామాయణం పై చాలా సినిమాలు వచ్చినప్పటికీ, రామాయణ కథ అందరికీ తెలిసిందే అయినప్పటికీ హ్యూమన్ ఎమోషన్స్ కి ఉన్న రీచ్ కారణంగా ఇప్పటికి కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎప్పుడు లేనిది బాలీవుడ్ జనాల చూపు రామాయణంపై పడటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇప్పటివరకు బాలీవుడ్లో పురాణ ఇతిహాసాల మీద టీవీ సీరియల్స్ వచ్చాయి గానీ, సినిమాలు చాలా అరుదు. ఇప్పుడు ఉన్నట్టుండి రామాయణం మీదకి దృష్టి మళ్లటం వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందేమోనన్న సందేహం కలుగుతోంది. కరోనా పాండమిక్ ముందు నుండి బాలీవుడ్లో కథల కొరత ఏర్పడిన మాట వాస్తవం. అదే సమయంలో RRR లాంటి తెలుగు సినిమా పాన్ ఇండియా హిట్ అయ్యి ఆస్కార్ సాధించడం, కార్తికేయ లాంటి మీడియం రేంజ్ సినిమా కూడా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో బాలీవుడ్ మేకర్స్ ఆలోచనా తీరు మారినట్టు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమాల్లో అవసరం ఉన్నా లేకున్నా సౌత్ ఫ్లేవర్ ని ఇరికిస్తున్న బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పుడు సౌత్ లో సక్సెస్ అయిన మైథలాజికల్ జానర్ పై దృష్టి పెట్టారు.

- Advertisement -

పౌరాణిక ఇతిహాసాలను ఇప్పటి తరానికి చేరువయ్యేలా టెక్నాలజీ ఉపయోగించి రూపొందించటం మంచిదే అయినప్పటికీ, రామాయణం లాంటి ఎపిక్ స్టోరీ సినిమాగా అడాప్ట్ చేసే ప్రాసెస్ లో కథలోని సోల్ మిస్ అయితే మాత్రం సినిమా యూనిట్ అభాసు పాలయ్యే అవకాశం ఉంది. ఆదిపురుష్ సినిమా రిజల్ట్ ని బట్టి తర్వాత రాబోయే సినిమాల ఫేట్ డిసైడ్ అవ్వనుంది. మరో పక్క, సడన్ గా బాలీవుడ్ కి పురాణాల మీద ఆసక్తి కలగటానికి కారణం బీజేపీ ప్రాపగాండా ఉందని మరో వాదన వినిపిస్తోంది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో సినిమాల ద్వారా తమ హిందుత్వ ఎజెండా జనాల్లోకి తీసుకెళ్లి లాభపడాలన్నది బీజేపీ ఉద్దేశం అన్నది కొందరి అభిప్రాయం.

మతపరమైన స్ట్రాటజీతో సినిమాలు తీస్తే పొలిటికల్ గా బెనిఫిట్ ఉంటుంది అన్నది ఎంతవరకు నిజమో చెప్పలేం గానీ, గతంలో కూడా ఎన్నికలే టార్గెట్ గా చాలా సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. ఇక ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే, ప్రభాస్ గత చిత్రాలు సాహో, రాధేశ్యామ్ అనుకున్న స్థాయిలో ఆడకపోవడం వల్ల ఈ సినిమా హిట్ అవ్వటం తప్పనిసరి అన్న పరిస్థితి నెలకొంది. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూస కథలతో ట్రాక్ తప్పి వెంటిలేటర్ మీద ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ కి రామనామ జపం కొత్త ఉపిరినిస్తుందా లేదా వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు