Ayesha khan : బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ తెలుగులో యమా బిజీ!

టాలీవుడ్ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగాక తెలుగులో నటించడానికి బాలీవుడ్ భామలు సైతం క్యూ కడుతున్నారన్న సంగతి తెలిసిందే. అలియా భట్ మొదలుకొని జాన్వీ కపూర్ దాకా తెలుగులో ఆ హీరోతో చేయాలనీ ఉందని, ఆ డైరెక్టర్ తో వర్క్ చేయాలనీ ఇంటర్వ్యూ లలో హీరోయిన్లు చెప్పడం చూసే ఉంటాం. ఇక బాలీవుడ్ లో బిగినింగ్ స్టేజ్ లో ఉన్న హీరోయిన్లయితే బాలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే సినిమా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అలాంటి ఆశలతోనే ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అయేషా ఖాన్. ఈమె తెలుగువాళ్ళకు పెద్దగా పరిచయం లేదు. కానీ ఈ ఇయర్ లో మాత్రం ఈ భామ తెలుగులో ఫేమస్ కావడం ఖాయమని ఆమె సినిమాల లైనప్ చూస్తే తెలుస్తుంది.

హిందీలో పలు సీరియళ్ళలో నటించిన ఈ భామ, హిందీ బిగ్ బాస్ సీజన్ 17 ద్వారా ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో ముఖ చిత్రం అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా అంతగా ఆడలేదు కాబట్టి జనాలకి తెలీదు. కానీ ఈ సంవత్సరం మాత్రం వరుస తెలుగు సినిమాలతో బిజీ అవుతుంది. ఇప్పటికే విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి లో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ సుందరి, లేటెస్ట్ గా శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘ఓం భీమ్ బుష్’ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ లో సెకండ్ లీడ్ గా ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. అంతే కాక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమా దక్కించుకుందని సమాచారం.

ఇక అయేషా ఖాన్ నటిస్తున్న ఈ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్టయినా ఈ అమ్మడి దశ తిరిగిపోతుంది. పైగా ఈ సినిమాలన్నీ ఈ ఇయర్ లోనే రిలీజ్ అవుతున్నాయి. ఒక సినిమా హిట్టయినా ఆ వంకతో మరో అరడజను ఛాన్సులు కొట్టేయొచ్చు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బిగ్ బాస్ బ్యూటీ లక్ ఎలా ఉందో ఈ ఇయర్ లో రిలీజ్ అవబోయే సినిమాలతో చూడాలి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు