Tollywood: “భరత నాట్యం” కథేంది?

Tollywood:

టాలీవుడ్ లో ఈ మధ్య చిన్న సినిమాలే రాజ్యమేలుతున్నాయి. మొన్న బేబీ, నిన్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, తాజాగా “మ్యాడ్“. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బయ్యర్లకి భారీ లాభాల్ని చేకూరుస్తున్నాయి. అందుకే బడా ప్రొడ్యూసర్లు కూడా చిన్న సినిమాలే తీయడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి కోవలో తాజాగా ఆడియన్స్ ని అలరించడానికి రాబోతున్న సినిమా “భరత నాట్యం”. పేరు చూసి ఎదో క్లాసికల్ మూవీ అనుకోకండి.

ఇది పక్కా కామెడీ డ్రామా.. దొరసాని సినిమా తీసిన డైరెక్టర్ కె. వి. ఆర్. మహేంద్ర ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన భరత నాట్యం టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. టైటిల్ ని చూసి టీజర్ చూసిన వారందరూ షాక్ అయ్యారు. టీజర్ లో చెప్పిన దాన్ని బట్టి ఈ సినిమాలో హీరో డైరెక్టర్ కావాలన్న కోరికతో ఇండస్ట్రీకి వస్తాడు. ఆ క్రమంలో తప్పని పరిస్థితుల్లో ఒక తప్పుడు పని చేయడానికి రెడీ అవుతాడు. ఆ పనేంటి? మధ్యలో వైవా హర్ష, పాత్రేంటి? అసలు భారత నాట్యం అంటే ఏంటి? అది డాన్స్ పేరు కాకపోతే, మరేదైనా వస్తువు పేరా? అందరూ దానికోసం ఎందుకు వెతుకుతున్నారు అనేది కథ.

- Advertisement -

ఇంతకు ముందు ఈ కాన్సెప్ట్ తో ‘స్వామి రారా’ లాంటి సినిమాలు చాలా వచ్చాయి. అయితే స్క్రీన్ ప్లే బలం మీదే సినిమా ఆడుతుందన్న విషయం మేకర్స్ గుర్తుంచుకుంటే మంచిది. ఇక ఈ సినిమాలో సూర్య తేజ హీరోగా నటించగా మీనాక్షి గోస్వామి హీరోయిన్ గా నటించింది. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు