NBK 109 : సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్న బాలయ్య… బాబీ ప్రాజెక్ట్ ఆగినట్టే?

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కొత్త ప్రాజెక్టు హోల్డ్ లో పడబోతోందా? అంటే ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం అవును అనే సమాధానమే వినిపిస్తోంది. త్వరలోనే బాలయ్య సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి అదే నిజమైతే ప్రస్తుతం బాలయ్య, బాబీ కాంబోలో రూపొందుతున్న “NBK109” ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? అసలు బాలయ్య ఎందుకు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాడు? అనే వివరాల్లోకి వెళ్తే…

గత ఏడాది సంక్రాంతి సందర్భంగా వీర సింహారెడ్డి, దసరా కానుకగా రిలీజైన భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇక అదే జోష్ తో పెద్దగా బ్రేక్ తీసుకోకుండా, గ్యాప్ లేకుండా నెక్స్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడంతో పాటు శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ బాబితో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని “NBK109” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటూ ఉండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే 2023 సంక్రాంతి బరిలో బాలయ్య “వీర సింహారెడ్డి” సినిమాతో, బాబి “వాల్తేరు వీరయ్య” సినిమాతో బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడ్డారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలోనే ఈ సినిమా రావడం విశేషం. ఇక ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గానే జరుగుతున్నప్పటికీ ఇంకా రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. బాలయ్య త్వరలోనే సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతుండడమే దానికి ప్రధాన కారణం అంటున్నారు.

NBK 109 కోసం జనవరి నుంచి స్టార్ట్ చేసి ఫిబ్రవరిలో కూడా నాన్ స్టాప్ గా బాలయ్య షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరో వారం పాటు ఇదే వేగంతో షూటింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల నేపథ్యంలో బాలయ్య సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి, ఎలక్షన్స్ పై దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రానున్న ఎన్నికల్లో టిడిపి గెలిస్తే బాలయ్యకు ఈసారి మంత్రి పదవితో సహా మరిన్ని కీలక పనులను టిడిపి అధిష్టానం అప్పగించవచ్చు. కాబట్టి హిందూపూర్ నియోజకవర్గంతో పాటు ఇతర ఎన్నికల ప్రచారాలపై దృష్టి పెట్టాలని బాలయ్య భావిస్తున్నారట. ఈ కారణం చేతనే 2024 మార్చ్ నుంచి దాదాపు మూడు నెలల పాటు సినిమాలకు ఆయన బ్రేక్ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారట. అయితే బాలయ్య షూటింగ్ కి తిరిగి ఎప్పుడు అందుబాటులో ఉంటారో కచ్చితంగా తెలియదు కాబట్టే మేకర్స్ NBK109 రిలీజ్ డేట్ ను ప్రకటించలేదని సమాచారం.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు