Ashika Ranganath: లక్ అంటే ఈమెదే… మూడో సినిమాకే మెగాస్టార్ తో ఛాన్స్ 

కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ నక్కతోక తొక్కినట్టుగా ఉంది. మొదటి సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ సెకండ్ ఛాన్స్ లోనే స్టార్ హీరో తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజా సమాచారం ప్రకారం నెక్స్ట్ మూవీలో చిరంజీవితో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని అందుకుంది అషికా. ఇంతకీ ఆమె మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఆ సినిమా ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే….

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “అమిగోస్” అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అషికా. అయితే ఫస్ట్ మూవీనే డిజాస్టర్ కావడంతో ఆమెకు నిరాశ తప్పలేదు. అయితే కాస్త లేటుగా అయినా సరే లేటెస్ట్ అన్నట్టుగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి రొమాన్స్ చేసే అవకాశాన్ని అందుకుంది. రెండవ సినిమా “నా సామి రంగ”తో హిట్ అందుకోవడమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాలో ఆమె స్క్రీన్ ప్రజెన్స్, పర్ఫామెన్స్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ అమ్మడిని ఇప్పుడు వరుస అవకాశాలు పలకరిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని పట్టేసింది అషికా. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న “విశ్వంభర” సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించే ఛాన్స్ అషికాకు దక్కినట్టు సమాచారం. ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఈ వార్తలు గనుక నిజమైతే అషికా ఫేట్ మారినట్టే. టాలీవుడ్ లో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కావడం పక్కా.

కాగా “విశ్వంభర” సినిమాలో చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీలో ఐదుగురు హీరోయిన్లు కనిపించబోతున్నారు. అందులో ఒకరిగా కనిపించే అవకాశాన్ని మీనాక్షి చౌదరి దక్కించుకుందని ఇప్పటికే వార్తలు రాగా, తాజాగా మరో హీరోయిన్ గా అషికా రంగనాథ్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. త్వరలోనే హీరోయిన్ల విషయమై చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం “విశ్వంభర”. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు