Vishwambhara : “విశ్వంభర”లో యంగ్ బ్యూటీ ఫిక్స్… సురభికి గోల్డెన్ ఛాన్స్

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం “విశ్వంభర”లో మరో యంగ్ బ్యూటీ సురభికి ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఇప్పుడు అస్సలు ఫామ్ లో లేకపోవడం గమనార్హం. ఆల్మోస్ట్ జనాలు ఆమెను మర్చిపోయే స్టేజ్ లో ఉండగా, ఇలాంటి సమయంలో సురభికి చిరుతో స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ దక్కింది అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ ఫాంటసీ డ్రామా “విశ్వంభర”. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు టైటిల్ గ్లింప్స్ తోనే హైప్ గ్రాఫ్ పెంచేసింది. మెగా ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న “విశ్వంభర” 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో వేసిన 13 భారీ సెట్లలో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష నటించబోతోంది అన్న విషయాన్ని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు. ఈ క్రమంలోనే “విశ్వంభర”లో హీరోయిన్ల విషయమై రోజుకో వార్త వైరల్ అవుతోంది. అందులో భాగంగానే తాజాగా హీరోయిన్ సురభికి ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యే గోల్డెన్ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది.

జెంటిల్ మెన్, బీరువా, ఎక్స్ప్రెస్ రాజా, ఒక్క క్షణం వంటి సినిమాల్లో నటించి తనకంటూ టాలీవుడ్ లో ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. అయితే అందం, అభినయం ఉన్నప్పటికీ ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కలేదు. 2013లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఈ అమ్మడికి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ రాలేదు. ఇక 2019 తరువాత ఈ అమ్మడు తెరమరుగైంది. ఈ నేపథ్యంలోనే “విశ్వంభర”లో నటించబోతున్న 5గురు హీరోయిన్లలో ఒకరిగా కనిపించే ఛాన్స్ సురభికి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలు గనుక నిజమైతే సురభికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మీనాక్షి చౌదరి, అషికా రంగనాథ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే హీరోయిన్ల విషయంపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం చిరు యూఎస్ ట్రిప్ లో ఉండగా, త్వరలోనే తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఫిబ్రవరి 24న చిరు మళ్ళీ సెట్స్ లో జాయిన్ కానున్నారు. మార్చ్ 2వ వారంలో ఈ మూవీ మొదటి టాకీ పార్ట్ పూర్తి కానుంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు