తెలుగు సినీ దర్శకుడు ఈవీఈ సత్యనారాయణ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన నట వారసులుగా ఇద్దరు కుమారులు హీరోలుగా రంగ ప్రవేశం చేశారు. పెద్ద కుమారుడు ఆర్య రాజేష్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బందులు పడినప్పటికీ చిన్న కుమారుడు అల్లరి నరేష్ మాత్రం ఒక రకంగా హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆర్యన్ రాజేష్ కి చెప్పుకోదగిన హిట్ ఇప్పటి వరకు ఒకటి కూడా లేదు.
అందుకే ఆర్యన్ తెలుగు చిత్ర పరిశ్రమకు కాస్త దూరమయ్యాడనే చెప్పవచ్చు. 2012లో ‘బాలరాజు ఆడి బామ్మర్ది’ అనే తెలుగు సినిమా చేసిన తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని తమిళంలో ఓ సినిమా చేశాడు. ఇక ఆ తరువాత వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ సోదరుడిగా నటించాడు. ఈ సినిమాలో ఆయన విలన్ గా నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. తాజాగా ఆర్యన్ రాజేష్ విలన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పుడు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఆర్యన్ రాజేష్‌ను విలన్ గా పరిచయం చేసేందుకు ఒక అగ్ర దర్శకుడు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి ఈ మధ్య కాలంలోనే ఆర్యన్ రాజేష్ డిజిటల్స్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో రూపొందిన హలో వరల్డ్ అనే ఒక వెబ్ సిరీస్‌లో ఐటీ ఉద్యోగి పాత్రలో కనిపించారు. ఆ అగ్ర డైరెక్టర్ ఆర్యన్ రాజేస్‌ని విలన్‌గా పరిచయం చేసేందుకు అంతా సిద్ధం చేశారని.. ఇప్పటికే కథ కూడా చెప్పినట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ఆర్యన్ రాజేష్ ప్రకటించలేదు. త్వరలోనే క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. ఆర్యన్ రాజేష్ ఈ విషయంపై ఎప్పుడు స్పందించి బయటపెడతాడో వేచి చూడాలి.