Allu Arjun: అస్వస్థతకు గురైన అల్లు అర్జున్.. పుష్ప2 షూటింగ్‌కు బ్రేక్

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. వరుస సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుంటున్న ఈయన ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక పాట షూటింగ్ జరగాల్సి ఉండగా అది వాయిదా పడినట్టు సమాచారం. ప్రస్తుతం పుష్ప 2 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక బన్నీ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారనే చెప్పాలి. అంతేకాదు చిత్ర బృందం మొత్తం ఈ సినిమాని ఒక యుద్ధం లా చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడం దాదాపు పూర్తయిందట. ఇక ఒక పాటను మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉండగా.. దానికోసం ఏర్పాట్లు కూడా చేస్తున్న క్రమంలో అల్లు అర్జున్ కాస్త అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఐటమ్ సాంగ్ ని ఈ వారంలోనే చిత్రీకరించడానికి డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేయగా.. ఈ పాట షూటింగ్ ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యింది .

అనుకోకుండా అల్లు అర్జున్ అనారోగ్యం పాలవ్వడమే ఈ పోస్ట్ పోన్ కి కారణమని సమాచారం. అయితే ఉన్నట్టుండి ఇలా అనారోగ్యానికి గురవడానికి కారణం ఆయన గత కొన్ని రోజులుగా ఈ సినిమా కోసం రెస్టు లేకుండా కష్టపడుతున్నారట. అంతేకాదు ఈ వారంలో జరిగే పాట చిత్రీకరణ విషయంలో కూడా అన్ని రకాలుగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. రిహార్సల్స్ కూడా పూర్తి చేశారట. అయితే ఉన్నట్టుండి ఇలా అనారోగ్యానికి గురవడంతో షూటింగ్ని రెండో వారానికి మేకర్స్ పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలా అల్లు అర్జున్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన తిరిగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు