Animal Movie: సందీప్ చేసిన ఆ బుర్ర తక్కువ పనులే మైనస్ అయ్యాయా?

మోస్ట్ అవైటెడ్ వయోలెంట్ మూవీ “యానిమల్” డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యాక్షన్ మూవీస్ ను రీడిఫైన్ చేస్తాడని సినీ ప్రియులు భావించారు. అయితే ఈ మూవీకి థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. మితిమీరిన శృంగారం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా కొన్ని అలాంటి అనవసరమైన, అభ్యంతరకరమైన సన్నివేశాయువతరం అంతా ఈ సినిమాకు ఓటు వేస్తున్నప్పటికీ, కొంతమంది విమర్శకులు మాత్రం మూవీ డిసప్పాయింట్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా మూవీ మిక్స్డ్ టాక్ మూట కట్టుకోవడానికి కారణం సందీప్ రెడ్డి వంగానే. ఆయన చేసిన కొన్ని బుర్ర తక్కువ పనులే సినిమాకు మైనస్ అయ్యాయని అంటున్నారు. మరి ఆ బుర్ర తక్కువ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మితిమీలు సినిమాలో చాలా ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష పెడుతుంది. క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ అప్పటికే ప్రేక్షకుల ఓపిక నశించి డీలా పడిపోతారు.

లాస్ట్ సీన్ లో సెకండ్ పార్ట్ ఉంది అని తెలియజేయడం కోసం విపరీతమైన రక్తపాతాన్ని క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రేక్షకులు డైరెక్టర్లు అడుగుతున్న ప్రశ్న. అంతేకాకుండా ట్రైలర్ లో కనిపించిన ఒక ఎమోషనల్ సాంగ్ ను క్లైమాక్స్ ఫైట్ లో పెట్టారు. మరి అలా చేయాలనే ఆలోచన సందీప్ కి ఎలా వచ్చింది అనేది అర్థం కాని ప్రశ్న. ఇలాంటి కొన్ని పిచ్చి నిర్ణయాలే సినిమాకు మైనస్ అయ్యాయని టాక్ నడుస్తుంది ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో.

- Advertisement -

ఇక రష్మిక సైతం తన పాత్రను చేయడానికి ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సినిమా మొత్తంలో విలన్ బాబీ డియోల్ కు ఒక్క డైలాగ్ కూడా చెప్పే అవకాశం రాకపోవడం ఏంటో డైరెక్టర్ కే తెలియాలి. ఇక పృథ్వీరాజ్ పాత్ర కేవలం అతిధి పాత్రలా కనిపిస్తుంది. మిగిలిన నటీనటుల పాత్రలు థియేటర్ నుంచి బయటకు వచ్చాక పెద్దగా ఎవరికి గుర్తుండవు. అలా సినిమాలో ఉన్న నటీనటులు అందర్నీ వాడుకోవడంలో సందీప్ రెడ్డి విఫలమయ్యాడనే చెప్పొచ్చు.

సెకండ్ ఆఫ్, లెంత్, విపరీతమైన వైలెన్స్, డబుల్ మీనింగ్ డైలాగులు, సెకండ్ హాఫ్ లో అర్థం పర్థం లేకుండా వచ్చే రొమాంటిక్ సీన్లు సినిమాకు మైనస్ అయ్యాయి. ప్రేక్షకులు మూడున్నర గంటల వరకు థియేటర్లో కూర్చుని లెక్చర్లు వినడానికి ఆసక్తి చూపిస్తారని సందీప్ రెడ్డి వంగకు ఎలా అనిపించిందో మరి!

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు