Animal: మితిమీరిన శృం*రం… ఫ్యామిలీ ఆడియన్స్ దూరం

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం “యానిమల్”. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. థియేటర్లలో ఈ మూవీని కుటుంబ సభ్యులతో కలిసి చూడడానికి ఇబ్బంది పడాల్సిన సీన్లు కొన్ని ఉండడంతో ఈ మూవీనీ కేవలం బ్యాచిలర్ బాబులు మాత్రమే చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. సినిమాలో శృం*ర సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది.

ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ తో వచ్చే సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి. హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడానికి ఫ్లైట్లో తీసుకెళ్తూ ఏకంగా అందులోనే ఆమెతో కాపురం మొదలు పెడతాడు హీరో. ఈ క్రమంలో రష్మిక, రణబీర్ మధ్య వచ్చే బ్యాక్ టు బ్యాక్ లిప్ లాక్ సన్నివేశాలు తెరపై చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ కష్టపడతారు. ఇక సెకండ్ హాఫ్ లో మరో నటి త్రిప్తితో బెడ్రూం సన్నివేశాలను చూసే సాహసం ఫ్యామిలీ ఆడియన్స్ చేసే అవకాశం ఉందా? అంటే సందేహ పడకుండా నో చెప్పొచ్చు. అంతేకాకుండా విలన్ ఓ మనిషిని చంపేసి, ఆ వెంటనే శృం*రంలో పాల్గొనడం కూడా కౄరంగా అనిపిస్తుంది. ఇలా మితిమీరిన శృం*రం ఉన్నప్పుడు కుటుంబ సమేతంగా సినిమాను చూడలేరన్నది జగమెరిగిన సత్యం.

ఇది చాలదన్నట్టుగా రక్తపాతం ఓవర్ డోస్ అయింది. ఇలాంటి సన్నివేశాలను పెట్టి సందీప్ రెడ్డి వంగా స్వయంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను దూరం పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇంతటి వయోలెన్స్, శృం*రం ఓవర్ డోస్ బాలీవుడ్ కల్చర్ కు సరిపోతుందేమో కానీ, తెలుగు ప్రేక్షకులు మాత్రం అస్సలు ఒప్పుకోరు. ఆయన గత చిత్రం “అర్జున్ రెడ్డి”లో ఉన్న ముద్దు, శృం*ర సన్నివేశాలకే రచ్చ రచ్చ చేశారు. దీనంతటికీ తగినట్టుగా సెన్సార్ బోర్డు వారు A సర్టిఫికెట్ ఇచ్చారు.

- Advertisement -

కానీ మరీ ఇంతటి దారుణమైన శృం*ర భరిత, రక్తపాతం ఉన్న సన్నివేశాలకు వారు ఎలా అనుమతించారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇక సెకండ్ హాఫ్ కూడా డిసప్పాయింట్ చేసింది అంటూ నడుస్తున్న టాక్ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని థియేటర్లలో చూడడానికి ముఖం చాటేస్తున్నారు. కానీ యూత్ మాత్రం ఈ సినిమాను చూడడానికి క్యూ కడుతున్నారు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను దూరం పెట్టడం వల్ల కలెక్షన్స్ పై ఎంత వరకు ఎఫెక్ట్ పడుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు