Animal : రామ్ గోపాల్ వర్మ వల్లే సందీప్ రెడ్డి ఇలా తయారయ్యాడా?

సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన “యానిమల్” ఎట్టకేలకు డిసెంబర్ 1న థియేటర్లలోకి రానే వచ్చింది. భారీ హైప్ తో వచ్చిన ఈ మూవీ ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంటోంది. సినిమాలో శృగారం, వయోలెన్స్ ఎక్కువ కావడంతో ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని అస్సలు చూడలేరు. ఇవన్నీ సినిమాకు మైనస్ గా మారగా, సినిమాపై నెలకొన్న భారీ హైప్ ను సందీప్ ఉపయోగించుకోలేకపోయాడు అనే వాదన విన్పిస్తోంది. అయితే కలెక్షన్ల పరంగా సినిమా సేఫ్ అవుతుందని భావిస్తున్నారు ట్రేడ్ వర్గాలు. మరి కలెక్షన్ల పరంగా ఈ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. కాగా “యానిమల్” మూవీని చూసాక ఆర్జీవితో డైరెక్టర్ సందీప్ రెడ్డిని లింక్ చేస్తున్నారు విమర్శకులు.

ఇదిలా ఉండగా ‘యానిమల్’ సినిమాను చూసిన వారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను మరోసారి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పోలుస్తున్నారు. హీరో హీరోయిన్ల మధ్య ఎక్కువగా లిప్ లాక్ సీన్స్ ఉండడం, అలాగే మరో నటి త్రిప్తితో బెడ్రూం సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉండడం, విలన్ తనకు చెందిన ఒక మనిషిని కిరాతకంగా చంపేసి, ఆ వెంటనే ఓ అమ్మాయి తో శృంగారం చేయడం, ఆ వెంటనే తన ఇద్దరు పెళ్ళాలను కూడా లోపలికి రమ్మనడం వంటి అనవసరపు సన్నివేశాలను సందీప్ రెడ్డి సినిమాలో చూపించిన తీరు చూసి రాంగోపాల్ వర్మతో పోల్చడం వల్లే సందీప్ ఇలా తయారయ్యాడా అనిపిస్తుంది అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

రాంగోపాల్ వర్మ లాగా సందీప్ కూడా గంజాయి, డ్రగ్స్ కొడుతూ ఇలాంటి సన్నివేశాలను రాసుకున్నాడా అనే ఫీలింగ్ కలుగుతుందట సినిమాను చూసినంత సేపు. రాంగోపాల్ వర్మ కూడా తాగేసి తన సినిమాలో పిచ్చిపిచ్చి సన్నివేశాలు తీయడం చూస్తూనే ఉన్నాం. ఎన్నో హోప్స్ తో రిలీజ్ అయిన “యానిమల్” మూవీ అంచనాలను అందుకోకపోవడంతో నిరాశకు గురైన ఓ వర్గం ప్రేక్షకులు ఇలా కామెంట్స్ చేస్తున్నారు. మరి “యానిమల్” మూవీకి వస్తున్న రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని సందీప్ సెకండ్ పార్ట్ ను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీసే ప్రయత్నం చేస్తాడా? లేదంటే ఈ కామెంట్స్ ను లైట్ తీసుకుని తన దారిలో తాను నెక్స్ట్ పార్ట్ తీస్తాడా? అన్నది చూడాలి అయితే మరో వర్గం ఆడియన్స్ మాత్రం సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ డేనే ఈ మూవీ రికార్డు స్థాయి భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఏ మూవీ బ్రేక్ ఈవెన్ కూడా తక్కువ సమయంలోనే అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు