Dacoit: టీజర్ తోనే ఆకట్టుకుంటున్న అడవి శేష్..అదిరిపోయిందిగా..!

టాలివుడ్ లో ప్రముఖ యంగ్ హీరో అడవి శేషు చివరిగా మేజర్ సినిమాతో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా డేకోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే గూఢచారి 2 సినిమాను లైన్లో పెట్టిన అడవి శేషు.. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గానే జరుగుతోంది. ఇక ఇప్పుడు మరో సినిమాని అనౌన్స్ చేశాడు అడవి శేషు ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. అలాగే టైటిల్ తో పాటు ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు డెకోట్ అనే టైటిల్ని ఖరారు చేయడం గమనార్హం. ఒక ప్రేమ కథ అనే క్యాప్షన్ తో ఈ సినిమా రాబోతోంది. తాజాగా వదిలిన ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. ఈ టీజర్ లో ఒక యుద్ధాన్ని చూపించారు. ఒక సూట్ అవుట్ జరిగినట్టు జూలియట్ ఎన్నాళ్ళు అయింది మనం కలిసి అంటూ అడవి శేషు చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ మొదలవుతుంది. కలసి కాదు విడిపోయి అంటూ శృతిహాసన్ చెప్పడం మనం ఇందులో చూడవచ్చు. శృతిహాసన్ ఒక గన్ను పట్టుకొని అడవి శేషు కోసం వెతకడం అతను కనిపించగానే లోడ్ చేసి అతడికి గురిపెట్టడం చూపించారు.

అలాగే అడవి శేషు కూడా గన్ తీసి శృతిహాసన్ కి గురి పెట్టాడు. ఇద్దరు ఇలా ఒకేసారి షూట్ చేయడంతో టీజర్ ఎండ్ అవుతుంది. అయితే ఈ టీజర్ లో అడవి శేషు తనను మోసం చేశాడని చెప్పకనే చెప్పింది శృతిహాసన్. ఇలా ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది.తెలుగు హిందీ భాషల్లో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియాగా తెరకెక్కిస్తున్నారు.. ఇక ఈ సినిమాను శనేయిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

ప్రస్తుతం డెకాయిట్ అనే సినిమాకి సంబంధించి ఈ చిన్న టీజర్ వైరల్ గా మారుతోంది. శృతిహాసన్ అడవి శేషు కూడా సరికొత్తగా ఇందులో కనిపించబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మరి సినిమా విడుదల తేదీపై చిత్ర బృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు