Sleeping Position : ఏ స్లీపింగ్ పొజిషన్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా?

ఆరోగ్యకరమైన జీవితానికి ఆహారం, వ్యాయామం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారంలో లేదా నిద్రలో ఈ రెండింటిలో దేంట్లో లోపం ఉన్నా అనారోగ్యానికి గురి కావడం ఖాయం. మెంటల్, ఫిజికల్ హెల్త్ బాగుండాలంటే నిద్ర చాలా అవసరం. బాగా నిద్రపోయినప్పుడే శరీరానికి కావలసినంత విశ్రాంతి దొరుకుతుంది. అయితే మనం నిద్రపోయే విధానాల వల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్న విషయం మీకు తెలుసా? మరి ఎలా నిద్రపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లకిలా పడుకోవడం
వెల్లకిలా పడుకోవడం ఆరోగ్యానికి మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే అలా పడుకుంటున్నప్పుడు మన బరువు మొత్తం శరీరం పై సమానంగా పడుతుంది. అయితే ఇలా పడుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమిటంటే… వెన్నునొప్పి, మెడ నొప్పి ఉన్న వ్యక్తులు వెల్లకిలా పడుకోవడం వల్ల ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే అలర్జీలు లేదా జలుబు వంటి జబ్బులు ఉన్న వ్యక్తులు వెల్లకిలా పడుకుంటే ఇతర పొజిషన్లో కంటే ఇలా నిద్రిస్తున్నప్పుడు వారికి ఎక్కువ ఉపశమనం లభిస్తుంది. అయితే వెల్లకిలా పడుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉన్నట్టే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మరి అలా పడుకోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏమిటంటే కొన్ని రకాల వెన్నునొప్పి ఉన్న వ్యక్తులు వెల్లకిలా పడుకుంటే అది మరింత ఎక్కువవుతుంది. అలాగే గురక లేదా స్లీప్ అప్నియా ఉన్నవారికి వెల్లకిలా పడుకోవడం వల్ల ఆ లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి.

సైడ్ పొజిషన్లో పడుకోవడం
చాలామంది ఎడమవైపు లేదా కుడి వైపు తిరిగి పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ సైడ్ స్లీపింగ్ గురక, స్లీప్ అప్నియా తో సహా ఇతర శ్వాస సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వెన్ను నొప్పి లేదా తుంటి నొప్పితో బాధపడేవారు సైడ్ పొజిషన్లో పడుకోవడంతోపాటు కాళ్ల మధ్య దిండును ఉంచుకోవడంతో కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇక గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కుడి వైపుకు తిరిగి పడుకోవడం బెటర్. అలాగే సైడ్ స్లీపింగ్ అనేది గర్భిణీలలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇక సైడ్ స్లీపింగ్ వల్ల సమస్యలు ఏమిటంటే ఒకే వైపు ఎక్కువసేపు పడుకుంటే ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీంతో తిమ్మిర్లు రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఒళ్ళు నొప్పులు భుజం నొప్పి వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.

- Advertisement -

బోర్లా పడుకోవడం
బోర్లా పడుకోవడం వల్ల చాలామంది కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ పొజిషన్లో పడుకోవడం వల్ల గురక వంటి తేలికపాటి సమస్యలు తగ్గుతాయి. కానీ బోర్లా పడుకుంటే వచ్చే బెనిఫిట్స్ కన్నా సమస్యలే ఎక్కువ. బోర్లా పడుకుంటే ఊపిరి తీసుకోవడానికి తలను పక్కకు తిప్పాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల వెన్నముకపై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో మెడ, నడుమునొప్పి రావచ్చు. అంతేకాకుండా కంఫర్టబుల్ గా లేకపోతే నిద్రలో అటు ఇటు బొర్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సరిగ్గా నిద్రపోలేదు. ఇక బోర్ల పడుకునే వరు తమ మొఖాన్ని దీనిపై గట్టిగా అదమడం వల్ల ముఖంపై ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు బోర్లా పడుకోకుండా చూసుకోవాలి. ఇటీవల జరిగిన పరిశోధనలో ఇలా పడుకోవడం వల్ల సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు