మెగా స్టార్ చిరంజీవికి చాలా గ్యాప్ తర్వాత వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ ను ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా రికార్డులును తిరగ రాస్తుంది. చాల కలం తర్వాత చిరంజీవికి మంచి హిట్ వచ్చింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం మెగా స్టార్ వాల్తేరు వీరయ్య సక్సెస్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదే జోష్ తో ఇప్పుడూ ముందుకు కొనసాగుతున్నారు చిరంజీవి. ముందుగా సైన్ చేసిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. మెగా స్టార్ కు జోడీగా తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం “భోళా శంకర్”. ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లి పాత్రలో మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ఈ సంవత్సరంలోనే రిలీజ్ కానుంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ఒక కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ కొత్త షెడ్యూల్ లో భాగంగా ఒక భారీ కలకత్తా నగరానికి సంబంధించిన సెట్ నిర్మాంచారు. ఈ సెట్ లో నేటి నుంచి షూటింగ్ జరుపుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Continuing the Mega Blockbuster Festive Vibe with High Positive Energy😎#BholaaShankar New Schedule commences today in a Huge Kolkata set🔥
Mega🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @dudlyraj @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/6MHIhalliL
— BholāShankar (@BholaaShankar) January 17, 2023
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News