మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆచార్య సినిమా డిజాస్టర్ తరువాత గాడ్ ఫాదర్ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడనే చెప్పాలి. చిరంజీవి కెరీర్ లో టాప్ 15 సినిమాల్లో గాడ్ ఫాదర్ ఒకటి అని సక్సెస్ మీట్ లో స్వయంగా చిరంజీవి చెప్పిన విషయం తెలిసిందే.
ఇక తన తరువాత సినిమాని కేెఎస్ రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటించనుంది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. రెండు, మూడు రోజుల నుంచి సినిమా విడుదల తేదీకి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా తొలుత జనవరి 11కి లాక్ చేయగా ఇప్పుడు అయితే జనవరి 13కి మార్చేసినట్టు తెలుస్తోంది. అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నారు.
ఇటీవలే దర్శకుడు బాబీ దీపావళి సందర్భంగా టీజర్ రానున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీజర్ విడుదల తేదీ పై రేపు పుల్ క్లారిటీ రాబోతుంది. మొత్తానికి మెగా అభిమానులు మెగా 154 సినిమా టీజర్ పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా విడుదల చేసే టీజర్ లో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.