Bigg Boss Season 6 : బిగ్ బాస్ రెడీ

బిగ్ బాస్, టెలివిజన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో. హాలీవుడ్ లో ప్రారంభమైన ఈ షో, బాలీవుడ్, కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు పాకింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, కోలీవుడ్ లో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించారు. తెలుగులో మొదటి సారి తారక్ వ్యాఖ్యతగా ఉండగా, తర్వాత నేచురల్ స్టార్ నాని వచ్చాడు. ప్రస్తుతం కింగ్ నాగర్జున్ హోస్ట్ గా కొనసాగుతున్నాడు.

తెలుగులో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలాగే, బిగ్ బాస్ నాన్ స్టాప్ అనే పేరుతో ఓటీటీ వెర్షన్ కూడా తీసుకువచ్చారు. కానీ, ఐపీఎల్ తో పాటు మరికొన్ని కారణాల వల్ల ఈ ప్రయోగం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా, బిగ్ బాస్ నిర్వాహకులు ఆరో సీజన్ కు సర్వం సిద్ధం చేశారు. హోస్ట్ కింగ్ నాగర్జున తో షూటింగ్ కు సంబంధించిన చర్చలు కూడా జరిగిపోయాయని తెలుస్తుంది.

అలాగే కంటెస్టెంట్స్ లీస్ట్ ను కూడా నిర్వహకులు రెడీ చేశారట. ఈ లీస్ట్ లో జబర్ధస్త్ ఆది, యాంకర్లు శివ, దీపికా పిల్లి, వర్షిణి, నటి నవ్య స్వామి, చిత్రా రాయ్, ధన్షు తో పాటు మరికొంత మంది ఉన్నట్టు సమాచారం. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో వచ్చిన కొంతమంది కంటెస్టెంట్స్ కూడా ఈ ఆరో సీజన్ లో కనిపించే అవకాశముందని టాక్.

- Advertisement -

ప్రతి సీజన్ లా కాకుండా, ఈ సీజన్ లో ఎలాంటి విమర్శలు రాకుండా, నిర్వహకులు పక్కగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సారి కాస్త మసాలా ను పెంచాలని చూస్తున్నట్టు టాక్. దీని వల్ల ప్రేక్షకులను ఆకర్షించాలని అనుకుంటున్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు