Ranga Ranga Vaibhavanga Teaser : వైభవంగా..

డెబ్యూ సినిమాతోనే సంచలనాలు సృష్టించాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన “ఉప్పెన” సినిమా, ఉప్పెన లాంటి విజయాన్ని నమోదు చేసింది. మొదటి సినిమాతోనే వైష్ణవ్ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత వైష్ణవ్ హీరోగా ఓటీటీలో వచ్చిన “కొండపొలం” ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయినా, వైష్ణవ్ ఇమేజ్ కు డ్యామేజ్ మాత్రం జరగలేదు. అవకాశాలు తగ్గలేదు.

ఈ సినిమా తర్వాత ఈ మెగా మైనల్లుడు గిరీశయ్య దర్శకత్వంలో “రంగ రంగ వైభవంగా” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవ్ కు జోడీగా యంగ్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తుంది. గత రెండు సినిమాలకు భిన్నంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ లో కొంత వరకు ఆసక్తి నెలకొంది. దీనికి తోడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్లస్ గా మారనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన రెండు పాటలతో ఇది తెలిసిపోతుంది.

తాజా గా ఈ సినిమా నుండి టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈగో ఉన్న ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడితే, ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. అనే ఇంట్రెస్టింగ్ లైన్ తో డైరెక్టర్ గిరీశయ్య ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తుంది. వైష్ణవ్ తేజ్-కేతిక శర్మ మధ్య కెమెస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. డీఎస్పీ మార్క్ మ్యూజిక్ ఈ టీజర్ లో కనిపిస్తోంది.
మొత్తంగా టీజర్ అంచనాలను పెంచేలా ఉందని చెప్పొచ్చు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు