Vijayendra Prasad- పవర్ స్టార్ అకీరానందన్ కోసం వెయిటింగ్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోల కొడుకులు హీరోలవడం పెద్ద విశేషం కాదు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి మినహాయిస్తే మిగతా వాళ్లంతా నట వారసత్వం ఉన్నవాళ్లే. ఇకపోతే ఈ జనరేషన్ లో స్టార్ హీరోస్ అంటే పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు అని మనం చెప్పుకోవచ్చు. ఇదివరకే మహేష్ బాబు కొడుకు గౌతమ్, వన్ నేనొక్కడినే సినిమాలో కనిపించి అలరించాడు. ఆ సినిమాలో గౌతమ్ నటించిన విధానానికి ఒక యాక్టర్ గా పర్వాలేదు పైకొస్తాడు అని నిరూపించుకున్నాడు.

అలానే మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సితార స్క్రీన్ పైన కనిపించక ముందే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటం. రీల్స్ చేయటం వీటన్నిటి వలన సితారకి కూడా నటిగా మంచి కెరియర్ ఉంది అని దాదాపు అందరూ ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు.

ఇకపోతే ఇంకో స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న క్రేజ్ అతీతం అని చాలామంది అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పరిగణిస్తారు. అటువంటి పవన్ కళ్యాణ్ కి వారుసుడైన అకీరానందన్ ఎంట్రీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదివరకే అకీరా ఒక సినిమాలో కనిపించిన విషయం తెలిసింది.

- Advertisement -

ఇకపోతే అకీరా ఇప్పుడు ఫిలిం స్కూల్లో చదువుకుంటున్నాడు. అలానే మార్షల్ ఆర్ట్స్, పియానో, కరాటే వంటి కలల్లో కూడా అకిరా నందన్ మంచి పట్టు సాధించాడు. ఒకవైపు హీరో కాకముందే హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నిటిని అఖీరా నందన్ సాధించుకున్నాడు. ఇకపోతే రీసెంట్ గా ఖుషి రీ రిలీజ్ లో కనిపించిన అకీరానందన్ హీరో మెటీరియల్ అని అనిపించాడు. తన తండ్రిలాగే ఎంతో బిడియంతో ఒక హుడి ఏసుకుని చాకచక్యంగా అభిమానుల మధ్య నుంచి తప్పించుకొని వెళ్లిపోయాడు.
ఆ వీడియో కొన్ని రోజులు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

నిన్న జరిగిన టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్యాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…. రేణు దేశాయ్ ను ఉద్దేశిస్తూ మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉండొచ్చు, కానీ మీరు మాకు ఎప్పుడూ దూరం కాదు. మీ అబ్బాయి అకీరానందన్ ఎంట్రీ కోసం మేమందరం వేచి చూస్తున్నామని చెప్పుకొచ్చారు. నిజంగానే అకిరా నందన్ ఎంట్రీ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు