Guntur Kaaram Movie Review: గుంటూరు కారం మూవీ రివ్యూ

Critic’s Rating
2.25
About the movie
సంక్రాంతి టైంలో వచ్చే సినిమాల్లో దేన్నీ కూడా తక్కువ అని అనుకోలేం. ఏదో ఒక్క ఫ్యాక్టర్‌లో ఓ రేంజ్ మూవీ అని అనుకుంటేనే సంక్రాంతి లాంటి టైంలో రిలీజ్ చేస్తారు. అలా గుంటూరు కారం మూవీని కూడా రిలీజ్ చేశారు. అంతే కాదు.. దీనికి మూవీ టీం ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు. ఇంకా చెప్పాలంటే… సంక్రాంతికి అందరి ఫస్ట్ ఆప్షన్ గుంటూరు కారమే అని మూవీ టీమే గొప్పలు చెప్పుకుంది. అంతలా హైప్ ఉన్న ఈ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ మూవీ అంచనాలను అందుకుని డైరెక్టర్ & ప్రొడ్యుసర్ల నమ్మకాన్ని నిలబెట్టిందా? అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్ధాం.

కథ:

రమణ గాడు (మహేష్ బాబు)… వసుంధర (రమ్య కృష్ణ), సత్యం (జయరాం)ల కొడుకు. గుంటూరులో ఉన్న వీళ్ల మిర్చి గోదాంపై దాడి జరుగుతుంది. ఈ ప్రమాదం వల్ల సత్యం హత్యానేరంపైన జైలుకి వెళ్తాడు. రమణ ఓ కన్ను పొగుట్టుకుంటాడు. వసుంధర అందరినీ వదిలేసి వాళ్ల తండ్రి పొలిటిషన్ వెంకట స్వామి (ప్రకాశ్ రాజ్) దగ్గరకి వెళ్తుంది. అక్కడ నారాయణ (రావు రామేష్)ను రెండో పెళ్లి చేసుకుంటుంది. స్టేట్ మినిస్టర్ కూడా అవుతుంది.

- Advertisement -

అయితే రమణ పెద్దొడు అయ్యక ఓ పేపర్ పై సంతకం పెట్టడానికి హైదరబాద్‌కి రమ్మని వెంకట స్వామి పిలుస్తాడు. ఆ పేపర్‌లో సంతకం చేస్తే రమణ – వసుందరకు మధ్య తల్లి కొడుకుల సంబంధం తెగిపోతుంది. అయితే దానిలో రమణ సంతకం పెట్టడానికి ఇష్టపడడు. రమణ సంతకం ఎందుకు పెట్టడం లేదు? సంతకం పెడితే ఏం జరుగుతుంది? రమణను వసుందర ఎందుకు వదిలేసింది? ఈ తల్లి కొడుకుల ప్రయాణం ఎక్కడి వరకు వెళ్లింది. అనేది మిగితా స్టోరీ.

విశ్లేషణ:

ఓ టైంలో ప్రొడ్యూసర్ నాగ వంశీ “గుంటూరు కారం మూవీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. దాన్ని ఎలాంటి రివ్యూలు ఏం చేయలేవు” అంటూ ఓ స్టెట్మెంట్ ఇచ్చాడు.

దీని తర్వాత సినిమాలను అంచనా వేయడంలో ఈయన తర్వాతే ఎవరైనా అనే పేరున్న దిల్ రాజు… సంక్రాంతికి అందరి ఫస్ట్ ఆప్షన్ గుంటూరు కారమే అని చెప్పుకొచ్చాడు.

ఇక అన్నింటికి కంటే ముఖ్యంగా… మహేష్ బాబు – త్రివిక్రమ్ మ్యాజికల్ కాంబినేషన్, ఇప్పటి వచ్చిన అతడు, ఖలేజ సినిమాలు.
వీటి వల్ల గుంటూరు కారం సినిమాపై ఎక్కడ లేని హైప్ వచ్చింది. ఈ హైపే గుంటూరు కారం సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఇవేవీ లేకుంటే… సినిమా కనీసం యావరేజ్ అనే టాక్ అయిన వచ్చేదేమో.

పైన చెప్పినట్టు అంతా హైప్ ఇచ్చిన తర్వాత… సినిమా ప్రారంభం నుంచి ఏదో ఉంది… ఇంకా ఏదో రావాలి… అనే ఫీలింగ్ వస్తూనే ఉంటుంది. సినిమా అయిపోయాకా… ఏదో మిస్ అయిందే… అసలేం జరిగింది?… మనం ఏం చూశాం?.. ఇందులో ఏం స్పెషల్ ఉంది? అలాంటి ప్రశ్నలు రాక మానదు.

అయితే మూవీ స్టార్టింగ్‌ బాగానే సాగింది. హీరో ఇంట్రడక్షన్… పార్టీ ఆఫీస్ దగ్గర మహేష్ చేసే విధ్వంసం అన్ని కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇక ముందు సేమ్ ఇదే ఫామ్‌లో సినిమా వెళ్తుందని నమ్మకం వస్తుంది. కానీ, పేపర్స్ పైన సంతకం అంటూ ఫస్ట ఆఫ్ ను మొత్తం లాగారు. అందు కోసం హీరో గుంటూరు – హైదరాబాద్ కి జీప్ వేసుకుని తిరగడం, చిన్న పాటి అర్థం లేని ఫైట్లు రావడం, సంతకం చేయకుండనే వెళ్లిపోవడం ఫస్టాఫ్‌లో కనిపిస్తాయి. ఇలా చూశాకా… ఆ సైన్ ఏదో చేసేస్తే హీరో గుంటూరు – హైదరాబాద్ మధ్య తిరగడం అయిన తగ్గుతుంది అనే ఫీల్ వస్తుంది.

ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అయిన ఫస్టాఫ్.. నీరసంగా ముగుస్తుంది. సెకండాఫ్‌లో అయినా, స్టోరీ వేగం పుంజుకుంటుంది అంటే.. అదీ లేదు. సింక్ కాని సన్నివేశాలు వస్తూ ఉండటం వల్ల ల్యాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ హరి దాస్ ఫైట్ నుండీ పికప్ అవుతుంది. క్లైమాక్స్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది.

ఇలా స్టోరీ, స్క్రిన్ ప్లే పెద్దగా పేలక పోయినా, కనీసం మాటల మాంత్రికుడుగా త్రివిక్రమ్ తన బాధ్యతను కూడా సరిగ్గా నిర్వహించలేదు. గురూజీ మార్క్ డైలాగ్ ఒక్కటి అంటే ఒక్కటి కూడా సినిమాలో లేదు. సినిమా మొత్తం చూసిన తర్వాత త్రివిక్రమ్ సినిమాకే వచ్చామా అనే ఫీల్ అయితే తప్పకుండా వస్తుంది. ఇక సినిమాలో ప్లస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది కేవలం మహేష్ బాబు మాత్రమే. ఒక మాటలో వన్ మ్యాన్ షో.

సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి మహేష్ ఎలా ఉండాలో.. గుంటూరు కారంలో అలా ఉన్నాడు. డ్యాన్స్, ఫైట్స్ లను మహేష్ ఈజ్ గా చేసేశాడు. ఒక వేళ గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు తీసుకువచ్చిందంటే.. కేవలం మహేష్ వల్లే అని చెప్పొచ్చు. ఇదే టైంలో త్రివిక్రమ్ డైరెక్షన్ పై కూడా ట్రోల్స్ రావొచ్చు.

శ్రీలీలతో పాటు ఎవరి పాత్రలకు కూడా పెద్దగా స్కోప్ లేదు. కానీ, శ్రీలీల డ్యాన్స్ ఆకట్టుకుంటుంది. మీనాక్షీ చౌదరి పాత్ర గురించి చెప్పడానికి ఏం లేదు. ప్రకాష్ రాజ్, రమ్యక్రుష్ణ, జయరాం పర్వలేదు అనిపించారు. సునిల్ సినిమాలో ఉన్నా… అసలు ఉన్నాడా.. అనే మాట అనలేక ఉండలేం.

ఇక థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కానీ, కొన్ని చోట్ల ఇదే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బోర్ కొట్టిస్తుంది. కూర్చి మడతపెట్టి, మావా ఎంతైనా అనే రెండు సాంగ్స్ కాస్త బాగున్నాయి. కెమెరా పనితనం కూడా బాగుంది.

ప్లస్ పాయింట్స్:

మహేష్ బాబు ఫర్మామెన్స్

రెండు సాంగ్స్

మైనస్ పాయింట్స్:

త్రివిక్రమ్ డైరెక్షన్

మొత్తంగా….
కుర్చీ మడత పెట్టేసి వెళ్లిపోయెంత ఘోరంగా అయితే లేదు కానీ.. మహేష్ వన్ మెన్ షో కోసం ఒకసారి ట్రై చేయొచ్చు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు