Nayan-Shivan : ఎట్టకేలకు స్ట్రీమింగ్

లేడీ సూపర్ స్టార్ నాయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇటీవల పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. అతి కొద్ది మంది అతిథుల మధ్య ప్రేమ జంట ఒకటైయ్యారు. పెళ్లి సమయంలో ఈ ప్రేమ జంట చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు గానీ, వీడియో గానీ బయటకు రాకుండా చూసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్ని ఫోటోలను విఘ్నేష్ శివాన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ ఫోటోలు మినహా నయన్-శివన్ పెళ్లికి సంబంధిన ఫోటోలు గానీ, వీడియోలు గానీ బయటకు రాలేదు.

అయితే, తమ పెళ్లిని ఫ్యాన్స్ అందరికీ చూపించడానికి నయనతార పెద్ద ప్లాన్ వేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం చేసుకుంది. భారీ ధరకు తమ పెళ్లిని స్ట్రిమింగ్ చేయడానికి అంగీకరించింది. దీని కోసం నెట్ ఫ్లిక్స్ బృందం నయన్-శివన్ పెళ్లిని ప్రత్యేకంగా చిత్రీకరించారు. అయితే, పెళ్లి అయి నెలలు గుడుస్తున్నా, నెట్ ఫ్లిక్స్ లో పెళ్లి స్ట్రీమింగ్ కాలేదు. దీంతో గత రెండు రోజుల నుండి ఈ వ్యవహారం పై కొన్ని వార్తలు వస్తున్నాయి.

విఘ్నేష్ శివన్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై నెట్ ఫ్లిక్స్ అసంతృప్తి గా ఉన్నారని, దీంతో వీరి మధ్య ఒప్పదం రద్దు అయిందని, నయన్- శివన్ 25 కోట్లు నష్టపోయారని వార్తలు వినిపించాయి. అయితే, పుకార్లుకు బ్రేక్ వేస్తూ, నెట్ ఫ్లిక్స్ తాజాగా ఒక ట్వీట్ చేసింది. ‘త్వరలోనే నయన్-శివన్ నెట్ ఫ్లిక్స్ లోకి వస్తున్నారు. వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ చేయడానికి సంతోషంగా ఉన్నాము’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు నయన్-శివన్ ఫోటోలను కూడా నెట్ ఫ్లిక్స్ షేర్ చేసింది. అయితే, ఈ పెళ్లి వీడియో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుందో డేట్ మాత్రం ప్రకటించలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు