Game Changer : దిమ్మ తిరిగే ధరకు డిజిటల్ రైట్స్ సోల్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత చెర్రీ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కావడంతో ‘గేమ్ ఛేంజర్’పై హైప్ గ్రాఫ్ ఆకాశాన్ని తాకింది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ డిజిటల్ రైట్స్ దిమ్మతిరిగే ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. మరి ఇంతకు ‘గేమ్ ఛేంజర్’ స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకున్న ఓటిటి ప్లాట్ ఫామ్ ఏంటి? ఎంతకు కొనుగోలు చేశారు? అనే వివరాల్లోకి వెళ్తే….

‘గేమ్ ఛేంజర్’కు మాసివ్ డీల్
‘గేమ్ ఛేంజర్’ మూవీ ఓటిటి రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మార్చ్ 19న ముంబైలో జరిగిన ప్రైమ్ వీడియో స్పెషల్ ఈవెంట్లో ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించిన సౌత్ లోని అన్ని భాషల రైట్స్ కోసం అమెజాన్ 105 కోట్లు చెల్లించినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మూవీ హిందీ డిజిటల్ రైట్స్ లో మాత్రం జీ5 అనే మరో ఓటిటీ సంస్థ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ట్రిపుల్ ఆర్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీతో పెరిగిన రామ్ చరణ్ స్టార్ డం, మరోవైపు రోబో వంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్ శంకర్ క్రేజ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీకి ఈ రేంజ్ లో ఓటిటి డీల్ సెట్ కావడానికి హెల్ప్ అయ్యింది.

‘గేమ్ ఛేంజర్’ లేటెస్ట్ అప్డేట్…
ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గా విశాఖపట్నంలో ఈ మూవీ షూటింగ్ జరిగింది. రెండేళ్ల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొదలు కాగా పలు కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. డైరెక్టర్ శంకర్ చెర్రీ మూవీకి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి, మధ్యలో కమల్ హాసన్ మూవీపై దృష్టి పెట్టారు. ఇండియన్ 2 మూవీ షూటింగ్లో శంకర్ బిజీగా ఉండడం వల్ల ‘గేమ్ ఛేంజర్’కు షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేకులు పడ్డాయి. ఆ మూవీని పూర్తి చేశాకే మళ్లీ ‘గేమ్ ఛేంజర్’పై దృష్టి పెట్టారాయన. ఏదైతేనేం ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మెగా ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాదులో జరగనుంది.

- Advertisement -

వాళ్ళతో పోలిస్తే తక్కువే…
ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలలో పుష్ప 2, దేవర, ‘గేమ్ ఛేంజర్’ ఉన్నాయి. అయితే డిజిటల్ రైట్స్ విషయంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాలతో పోల్చుకుంటే రామ్ చరణ్ మూవీకి తక్కువ బిజినెస్ జరిగిందనే చెప్పొచ్చు. పుష్ప 2 మూవీకి 200 కోట్ల డీల్ జరిగిందని, దేవరకు 155 కోట్ల డిజిటల్ రైట్స్ బిజినెస్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. మరి వీళ్ళతో పోలిస్తే ఇప్పుడు ఓటిటి డీల్స్ విషయంలో చెర్రీ వెనక బడిపోయినట్టే. అలాగే చెర్రీ గత చిత్రం ట్రిపుల్ ఆర్ మూవీ డిజిటల్ రైట్స్ 350 కోట్లకు అమ్ముడయ్యాయి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు